సిద్దాపూర్‌లో ఉద్రిక్త వాతావరణం
జవహర్ నగర్ బయలుదేరిన మహిళలను అడ్డుకున్న పోలీసులు
జవహర్ నగర్ కు బయలుదేరిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, వడ్డే బాలయ్య ను అదుపులోకి తీసుకున్న కొత్తూరు పోలీసులు
షాద్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు స్వచ్ఛందంగా వెళుతున్న భారతి జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి,వడ్డే బాలయ్య,మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి,శ్రీధర్, తదితర మహిళలను, అడ్డుకున్న రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీసులు.మహిళలకు మద్దతుగా నిలిచిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, వడ్డే బాలయ్య,మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి,శ్రీధర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.ఈ ఘటనతో సదరు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందస్తు చర్యగా తదితరులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.






