డంపింగ్ యార్డ్ తో భవిష్యత్తు అంధకారం
ఐటీ పరిశ్రమలు అడిగితే చెత్త కంపును తెస్తారా!
డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ ఎమ్మె సత్యనారాయణ
వైఎంతాండ, పులిచెర్లకుంట తండాలలో భారీ ర్యాలీ
షాద్ నగర్,(విజయక్రాంతి): సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆయన వైయం తండా, పులిచెర్లకుంట తండాలలో పర్యటించారు. మహిళలు యువకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి డంపింగ్ యార్డ్ వల్ల జరిగే అనర్ధాలు, నష్టం గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ ఎమ్మె సత్యనారాయణ మాట్లాడుతూ... డంపింగ్ యార్డ్ వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని అందుకు ఊరు, వాడ, తాండాలు ఏకం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించమంటే డంపింగ్ యార్డ్ ను మా నెత్తిన గుదిబండగా మోపుతున్నారని వాపోయారు.
రాజకీయాలు చేయడానికి మేము రాలేదని డంపింగ్ యార్డ్ వాళ్ళ జరిగే నష్టాలు మాత్రమే చెప్పేందుకు వచ్చామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు డంపింగ్ యార్డ్ రాదు రానివ్వమని చెప్తున్నారని వారి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. జీవో నెంబర్ 641 ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే విడుదల చేసిందని చెప్పారు. మనమంతా మేల్కొని డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సూచించారు. డంపింగ్ యార్డ్ ను వ్యతిరేకించాల్సింది పోయి కనీసం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మాకు మద్దతు తెలుపకుండా ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వడ్డే బాలయ్య, వైయం తండా మాజీ సర్పంచ్ అరుణ రమేష్ నాయక్, నరేందర్ రెడ్డి, ఎస్ బి పల్లి ఉప సర్పంచ్ సున్నాల గణేష్, బాబు రాజ్, శంకర్ నాయక్, రాందాస్ నాయక్, గోపాల్ నాయక్ తదితరులుపాల్గొన్నారు.






