ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది
21-08-2026 12:02 AM
మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి అడ్లూరి
ధర్మపురి, ఆగస్టు20(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద కరీంనగర్ - జగిత్యాల రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
కొండగట్టు బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.ప్రమాదంలో గాయపడిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.






