విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్
21-08-2026 12:37 AM
ఏడాది పాటు ఉచితంగా గూగుల్ ఏఐ ప్లస్
ఏఐ అసిస్టెంట్, సెర్చ్ ద్వారా ఎడ్యుకేషనల్ టూల్స్
న్యూడిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ భారతీయ కాలేజీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ‘గూగుల్ ఏఐ ప్లస్’ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. గూగుల్ ఏఐ అసిస్టెంట్, సెర్చ్ ద్వారా ఎడ్యుకేషనల్ టూల్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అమెరికాలోని కాలేజీ విద్యార్థుల కోసం గూగుల్ ఏఐ ప్రో ప్లాన్‌న్‌ను ఉచితంగా అందిస్తుండగా.. ఇప్పుడు భారతీయ కాలేజీ విద్యార్థుల కోసం ‘గూగుల్ ఏఐ ప్లస్’ను తీసుకురానుంది.






