21 August, 2026 | 12:39 AM

వెంకట లక్ష్మమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

21-08-2026 12:03 AM

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కాంగ్రెస్ నేత కే.మురళీధర్‌రెడ్డి

అన్నదానంలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులు

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): అబిడ్స్ నేతాజీ నగర్‌లోని శ్రీవెంక ట లక్ష్మమ్మ దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కే. మురళీధర్ రెడ్డి తమ కుటుంబ సభ్యులు కే. సాయి అక్షిత్ రెడ్డి, కే. విశ్వత్ రెడ్డితో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆ యురారోగ్యాలతో ఉండాలని వారు ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సాయి అక్షిత్ రెడ్డి, విశ్వత్ రెడ్డి, బబ్లు, బాబురావు తదితరులు పాల్గొని భక్తులకు అన్నప్ర సాదం అందించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమా లు, అన్నదానం ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగాయి.