21 August, 2026 | 1:13 AM

శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి కొత్త రూపు-

21-08-2026 12:02 AM

లాబీ నుంచి సమావేశ కార్యాలయం వరకు పునరుద్ధరణ

శేరిలింగంపల్లి,ఆగస్టు 20 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం గురువారం కొత్త రూపును సంతరించుకుంది. సిఎంసి కమిషనర్ శ్రీజన ఆధ్వర్యంలో కార్యాలయంలో ప లు అభివృద్ధి,మౌలిక వసతుల పనులు ప్రారంభమయ్యాయి.ప్రవేశ ద్వారాల వద్ద కొత్త సైనేజీలు, జెండా స్థంభం, ఎంట్రన్స్ లాబీతో పాటు శానిటేషన్ వి భాగం, డిప్యూటీ కమిషనర్ ఛాంబర్, సమావేశ కార్యాలయం పునరుద్ధరణ ప నులు పూర్తయ్యాయి.

ఈ సౌకర్యాలను సిఎంసి కమిషనర్ ప్రారంభించారు.పారిశుధ్యం,రోడ్ల నిర్వహణ పనులను వేగవం తం చేసేందుకు ఒక జేసీబీ, ఐదు బా బ్క్యాట్లు, నాలుగు మినీ రోలర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇవి జోన్లోని పారిశుధ్య, నిర్వహణ కార్యకలాపాలకు ఉపయోగపడతాయి.కార్యక్రమానికి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, జోన్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, యూబీడీ, విద్యుత్ విభాగాల అధికారులు, సిబ్బంది హాజర య్యారు. కొత్తగా ఏర్పాటైన సౌకర్యాలను సక్రమంగా నిర్వహించాలని, ప్రజలకు మున్సిపల్ సేవలు సమయానుకూలం గా అందేలా పౌర మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని కమిషనర్ సూచించారు.