21 April, 2026 | 4:51 AM

రైతుకు వెన్నుదన్నుగా ప్రభుత్వం

21-04-2026 03:23 AM

ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ 

కేసముద్రం, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రైతుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని, యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యం, మక్కలకు గిట్టుబాటు ధర అందించడానికి చర్యలు తీసుకుందని, రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కోరారు. సోమవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ను ఎమ్మెల్యే సందర్శించి మార్క్ఫెడ్ మక్కల కొనుగోళ్ల తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మక్కజొన్నలను విక్రయానికి తెచ్చే ముందు బాగా ఆరబెట్టి, 14 శాతం లోపు తేమ ఉండేటట్లు చూసుకొని, ఎటువంటి మట్టి పెల్లలు, చెత్తాచెదారం లేకుండా రైతుల పంట క్షేత్రాలలోనే శుభ్రపరచుకొని, అధికారులు తెలిపిన తేదీ ప్రకారం వచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూపాయలు 2,400 పొందాలని కోరారు.

రైతులకు మార్కెట్ యార్డ్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు కాంటాలు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని, కాంటాలు వేయగానే ఎప్పటికప్పుడు గోదాముకు షిఫ్ట్ చేసి త్వరితగతిన మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వర రావు, సీఐ సత్యనారాయణ, ఎస్ ఐ క్రాంతి కిరణ్, ఏవో బి. వెంకన్న, సొసైటీ సీఈవో మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు గూగులోత్ దసృ నాయక్, అంబటి మహేందర్ రెడ్డి, బండారు వెంకన్న, అల్లం నాగేశ్వరరావు, బానోతు వెంకన్న, మార్కెట్ డైరెక్టర్ వసంతరావు, ఏఈఓ కే.రవివర్మ, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.