29 July, 2026 | 1:14 AM

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

29-07-2026 12:08 AM

చిన్న చింతకుంట జులై 28: రైతులను అన్ని విధాలా మోసం చేస్తోందని బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మంగళవారం చిన్నచింతకుంట తహశీల్దార్కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, మండల అధ్యక్షుడు దశరథ్, జిల్లా నాయకులు శ్రీకృష్ణ, నరసింహ యాదవ్, బాలస్వామి, జోగు మాసన్న, వినోద్, ఆవుల రాజు, ఖలీల్, దాసు, వడ్డే మాస్, లంకల్ రవి, నగేష్, జలీల్, ముని, విష్ణు, జీడి బాబు, ప్రసాద్, బుక్క మైను తదితరులు పాల్గొన్నారు.