15 August, 2026 | 1:54 AM

గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం..

15-08-2026 12:55 AM

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరు సద్వినియోగం చేసుకోవాలి 

ఎంఎల్‌ఏ బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆగస్టు 14: ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలం పిట్ట బొంగరం జీపీలో రూ. 66 లక్షల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఐటీడీఏ పీవో మంద మకరందులతో కలిసి ప్రారంభించారు.

ఈ సంద ర్భంగా ఎంఎల్‌ఏ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత మంజూరులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఆదిమత్యంగా గిరిజనులకు ప్రత్యేకంగా మంజూ రు చేసిన ఇండ్ల మాదిరిగానే ఆదివాసులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో గిరిజన ఎమ్మెల్యేలందరం విన్నవించామని గుర్తు చేశారు. సీఎం సానుకూ లంగా స్పందించి ఆదివాసులకు ప్రత్యేకంగా ఇండ్లు మంజూరు చేయుటకు నిర్ణయించారన్నారు.

మొదటి విడతగా పిట్ట బొంగరం జీపీకి మంజూరు చేసిన 31 ఇండ్లలో ఏడాదిలో కేవలం రెండు ఇండ్లు పూర్తయ్యాయని, వాటిలోనూ సిడం మారుతికి చెందిన ఇంటి నిర్మాణం పూర్తిగా నాసిరకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు రూ. 22 కోట్లతో నిర్మించే రెండు వరుసల రహదారి పనులకు ఆర్థిక శాఖ అనుమతితో పాటు టెండర్లు పూర్తయ్యాయని వర్షాకాలం పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరు సూత్రాల ప్ర ణాళికతో జిల్లాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, ఒక్కొక్క అంశంపై ప్రజలకు వివ రించారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ ఏజె న్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న సిఆర్టి పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖలు పంపించామన్నారు. విద్య, వైద్యంతో పాటు అన్ని రంగా ల్లో గిరిజనులు అభివృద్ధి చెందే విధంగా సప్తగిరి కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. 

ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి ర వీందర్ రాథోడ్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కుడిమేత మనోహర్, సర్పంచ్ మడవి ఇంద్రదేవ్, మాజీ ఐటీడీఏ చైర్మన్ సిడం భీమ్ రావు, ఎంపీడీవో మహేందర్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఐటిడిఏ ఇంజనీరింగ్ విభాగం ఈఈ తానాజీ జాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.