15 August, 2026 | 3:38 AM

బంగారం గల్లంతు విచారణ వేగవంతం

15-08-2026 01:44 AM
  1. మేనేజర్‌తో సహా ఇతరుల పాత్రపై ఆరా
  2. బంగారం రికవరీ?

మహబూబాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేం ద్రంలోని ఇండియన్ బ్యాంకులో బంగారం గల్లంతు ఘటన విచారణ వేగవంతంగా సాగుతోంది. పోలీసు ప్రత్యేక ద ర్యాప్తు బృందం ఇప్పటికే ఈ కేసులో పురోగతి సాధించినట్లు చెబుతున్నారు. అసిస్టెంట్ మేనేజర్ భూక్యా రాజేష్ బ్యాంకు నుంచి తస్కరించిన బంగారం 700 గ్రాముల్లో కొంత స్థానిక ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి తను, తన బంధువుల పేరుమీద అప్పుగా నగదు తీసుకున్నట్లు గుర్తించారు.

అదృశ్యమైన సదరు అసిస్టెంట్‌మేనేజర్ కోసం గాలింపు చేపట్టారు. మొత్తం మీద గల్లంతైన బంగారంలో చాలావరకు రికవరీ చే సినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ కేసు చిక్కుముడి వీడిపోనున్నట్లు సమాచారం. అసిస్టెంట్ మేనేజర్ ఒక్కడే కాకుండా బ్యాంకులో ఖాతాదారులు తా కట్టు పెట్టిన బంగారాన్ని లాకర్లో భద్రపరిచి, తిరిగి తీసే సమయంలో ‘జాయిం ట్ కస్టడీ’ గా మరో అధికారి పర్యవేక్షణ ఉంటుందని, ఈ అంశంలో ఇతర అధికారుల పాత్ర ఏమిటన్నది విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా మొత్తాని కి బంగారం స్థానికంగానే రికవరీ దాదాపుగా చేసినట్లు తెలుస్తోంది.