అడవిలో కొలువైన మహంకాళి దేవత
03-04-2026 01:11 AM
భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు
ఉట్నూర్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లోని వాయి పెట్ అటవీ ప్రాంతంలో కొలువుదీరిన మహంకాళి దేవత పూజలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా మహంకాళి దేవత కు పూజలు చేయడం గత 20 సంవత్సరాల నుంచి వస్తున్న అనవాయితీ. మహంకాళి దేవత కు పూజారి కినకా సంభు మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా పూజలకు మహారాష్ట్రలోని నాగపూర్, యు వత మాల్, తదితర ప్రాంతాలతో పాటు నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల వివిధ జిల్లాల నుండి భక్తులు హాజరయ్యా రు. భక్తిశ్రద్ధలతో ఆలయం వద్ద మొక్కులను తీర్చుకున్నారు. మహంకాళి దేవత పూజల సందర్భంగా వాలీబాల్ కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశారు.




