ప్రజా సమస్యలు తీర్చడమే లక్ష్యం
18-08-2026 02:13 AM
మున్సిపల్ చైర్మన్ యూనుస్
జహీరాబాద్, ఆగస్టు 17 : ప్రజా సమస్యలు తీర్చడమే తమ లక్ష్యమని జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యునుస్ అన్నారు. సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ప్రజా సమస్యలు తీర్చేందుకు దశలవారీగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. చైర్మన్ వెంట కమిషనర్ జి.ప్రభాకర్, కౌన్సిలర్ సోనీ అమ్మ ఇర్మియా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






