29 June, 2026 | 3:17 AM

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

29-06-2026 12:00 AM

మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

హనుమకొండ,జూన్ 28(విజయ క్రాంతి): 2030 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత కోసం విస్తృత కార్యక్రమాలు అమలు చేస్తోందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.

ప్రజాపాలనప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ మహానగర పాలక సంస్థ, మేప్మా సంయుక్త ఆధ్వర్యంలో గీసుగొండ మండలం కొనయమాకుల గ్రామం లోని పీడీఆర్ గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్, జిడబ్లుఎంసి ప్రత్యేక అధికారి చాహాత్ బాజ్ పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే పరకాల నియోజకవర్గం జిడబ్లుఎంసి పరిధిలోని 15, 16, 17వ డివిజన్ల మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో మరింతగా రాణించేలా ప్రోత్సాహం అందిస్తున్నామని, పరకా ల మహిళా డెయిరీ ద్వారా మహిళలకు శా శ్వత ఆదాయ వనరులు కల్పించే దిశగా చర్య లు కొనసాగుతున్నాయని చెప్పారు.త్వరలో నే డెయిరీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, మహిళా సంఘాల కోసం ప్రత్యేక స మాఖ్య భవనం నిర్మాణానికి స్థల సేకరణతో పాటు అవసరమైన చర్యలు చేపడతామని వె ల్లడించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రాజేశ్వర్, ఉప కమిషనర్ సమ్మయ్య, మెప్మా డీఆర్‌ఎం రేణుక, టీఎంసీ రమేష్, సిబ్బంది, దయాకర్, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.