నవజాత శిశు సంరక్షణే ధ్యేయం
క్రిటికల్ కేర్‌పై యశోదలో సదస్సు
వెయ్యి మందికి పైగా ప్రసూతి వైద్య నిపుణులు, నీయోనేటాలజిస్టులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులతో మేటర్నల్ ఎమర్జెన్సీస్ అండ్ నీయోనేటల్ క్రిటికల్ కేర్ రియల్ కేస్, రియల్ డిసిషన్స్ రెండు రోజుల జాతీయ వైద్య సదస్సు అండ్ వర్క్‌షాప్‌ను యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మాతృ అత్యవసర పరిస్థితులు, నవజాత శిశువుల క్రిటికల్ కేర్ నిర్వహణపై వైద్యులకు మరింత అవగాహన పెంపొందించేందుకు మేటర్నల్ ఎమర్జెన్సీస్ అండ్ నీయోనేటల్ క్రిటికల్ కేర్ రియల్ కేస్, రియల్ డిసిష న్స్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ఈ నెల 14, 15 తేదీల్లో యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, 5వ అంతస్తు ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు.
ఈ సదస్సులో మాతృ, నవజాత శిశు అత్యవసర పరిస్థితుల నిర్వహణలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విధానాలపై చర్చించారు. యశోద హాస్పిటల్స్, మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి.యస్.రావు మాట్లాడుతూ.. ‘మాతృ, నవజాత శిశువులకు సంభవించే అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన నిర్ణయాలు, బహుళ వైద్య విభాగాల మధ్య సమన్వయం అత్యంత కీలకం అని అన్నారు.
ఈ సదస్సులో నిజ జీవిత వైద్య సందర్భాలు (రియల్ క్లినికల్ కేసులు) ఆధారంగా తీసుకునే నిర్ణయాలు తల్లి మరియు శిశువు ప్రాణాలను కాపాడడంలో ఎంత ముఖ్య మో వివరించనున్నారు. వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు ఇంటరాక్టివ్ సెషన్లు, కేస్ ఆధారిత చర్చలు, ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ల ద్వారా వైద్యుల క్లినికల్ నైపుణ్యాలను మరింత మెరుగుపరిచే విధంగా తమ అనుభవాలను పంచుకోనున్నారని డాక్టర్. జి. యస్. రావు , తెలిపారు.
న్యూరాలజికల్ సమస్యలు.. చికిత్స
యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ చైల్డ్ అండ్ అడోలెసెంట్ న్యూరాలజిస్ట్, డాక్టర్ లోకేష్ లింగప్ప మాట్లాడుతూ.. ‘నవజాత శిశువులలో ముఖ్యంగా న్యూరాలజికల్ సమస్యలు తక్షణ నిర్ధారణ, ప్రత్యేక చికిత్స అవసరంపడుతాయన్నారు. ఇలాంటి శాస్త్రీయ సదస్సులు వైద్యులకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విధానాలపై మరింత అవగాహన పెంచి, వారి క్లినికల్ నైపుణ్యాలను మరింత మెరుగుపరిచే విధంగా ఈ సదస్సును రూపొందించినట్టు చెప్పారు.
గర్భిణుల్లో అధిక రక్తస్రావం, మల్టీడిసిప్లినరీ నిర్వహణ, గర్భధారణలో హైపర్టెన్సివ్ అత్యవసర పరిస్థితులు, రక్తం గడ్డకట్టే సమస్యలు, టీటీపీ, హెచ్‌యూఎస్ వంటి థ్రాంబోటిక్ పరిస్థితులు, గర్భధారణలో ఫిట్స్ సమస్యలు, గర్భధారణకు సంబంధించిన కిడ్నీ సమస్యలు, నవజాత శిశువుల అత్యవసర పరిస్థితులు, న్యూరోలాజికల్ సమస్యలు వంటి ముఖ్య అంశాలపై లోతైన చర్చ జరిగినట్లు తెలిపారు.
వైద్యులకు క్రెడిట్ పాయింట్లు
ఈ సదస్సులో పాల్గొనే వైద్యులకు 2 టీజీఎంసీ క్రెడిట్ పాయింట్లు కూడా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు ఈ సదస్సులో పాల్గొని వారి ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు హ్యాండ్స్- ఆన్ వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించారు. మాతృ, నవజాత శిశు అత్యవసర చికిత్సల నాణ్యతను మెరుగుపరచడానికి ఈ సదస్సు ఒక మంచి వేదికగా నిలిచింది.




