15 March, 2026 | 1:53 AM

చిన్న ఆసుపత్రి పెద్ద శస్త్రచికిత్స!

15-03-2026 12:26 AM

పాల్వంచ సీహెసీలో మోకాలి కీళ్ల మార్పిడి

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 14 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పా ల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కార్పొరేట్ ఆసుపత్రులకు సాటిగా మరోసారి మో కాలి మార్పిడి (టోటల్ నీ రీప్లేస్‌మెంట్) శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వ హించారు. వరంగల్ పట్టణానికి చెందిన కవి త (52) మూడు సంవత్సరాలుగా ఎడమ మోకాలి తీవ్రమైన నొప్పితో బాధపడుతూ కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సం ప్రదించగా, రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతకుముందు మో కాలి మార్పిడి శస్త్రకిత్స నిర్వహించిన విష యం తెలిసి, అక్కడి ఆర్థోపెడిక్ నిపుణుడు డా. శైలేష్ కుమార్‌ను సంప్రదించారు. డా శైలేష్ వైద్య బృందం ప్రత్యేక చొరవతో శనివారం పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెకు ఎడమ మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.

ఈ శస్త్రచికిత్స నిర్వహించిన బృందంలో ఆర్థోపెడిక్ వైద్యుడు డా. శైలేష్ కుమార్, అనస్థీషియా వైద్యుడు డా.రామ్ ప్రసాద్, ఆపరే షన్ థియేటర్ సిబ్బంది రేవతి, స్వర్ణలత, ఉమ, సర్ఫరాజ్, నర్సింహ, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.