15 March, 2026 | 4:42 AM

వాస్క్యులర్‌పై అవగాహన అవసరం

15-03-2026 01:00 AM

కిమ్స్ హాస్పిటల్స్‌లో హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్

వాస్క్యులర్ వ్యాధులపై అవగాహన పెంపొందించడం, ఆధునిక చికిత్సా విధానాలను వైద్యులకు పరిచయం చేయడం లక్ష్యంగా వాస్క్యులర్ వోయేజెస్ ఫెమ్ పాప్: మిస్టరీ టు మాస్టరీ పేరుతో అంతర్జాతీయ స్థాయి వైద్య సదస్సు సాగింది. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ఒక రోజు పాటు ప్రత్యేక శిక్షణ హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్ జరిగింది. మూడో రోజుల పాటు సాగిన ఈ సదస్సును కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాస్కులర్ సైన్సెస్, హైదరాబాద్‌లోని వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి అనేక మంది వ్యాస్కులర్ వైద్యులు పాల్గొన్నారు. 

కిమ్స్ గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండి డా.భాస్కర్‌రావు పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సుకు భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వైద్యులు పాల్గొనడం గర్వించదగిన విషయం. వాస్క్యులర్ సర్జన్లు, నిపుణులు పాల్గొని వాస్క్యులర్ మెడిసిన్లో తాజా అభివృద్ధులు, ఆధునిక శస్త్రచికిత్సా విధానాలు, ఎండోవాస్క్యులర్ చికిత్సా పద్ధతులు, ముఖ్యంగా ఫెమోరోపోప్లిటియల్ ఆర్టరీ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతలపై తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా టెక్నాలజీ మరింత ముందుకు వెళ్తుందన్నారు. అంతే కాకుండా యువ వైద్యులకు ఇలాంటి సదస్సులు ఎంతో దోహాదం చేస్తాయన్నారు. 

జీవనశైలి ప్రధాన కారణం

ఆర్గనైజింగ్ చైర్మన్, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జరీ డా. నరేంద్రనాధ్ మాట్లాడుతూ.. మధుమేహం, ధూమపానం, రక్తపోటు, కూర్చునే జీవనశైలి వంటి కారణాల వల్ల పెరిఫెరల్ వాస్క్యులర్ వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధుల కారణంగా కాళ్లు, పాదాలకు రక్తప్రసరణ తగ్గిపోవడం వల్ల నడిచేటప్పుడు నొప్పి, మానని గాయాలు వంటి సమస్యలు ఏర్పడతాయి. సమయానికి చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన పరిస్థితుల్లో అవయవం తొలగించే ప్రమాదం కూడా ఉండొచ్చని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అకడమిక్ సెషన్లు, ప్యానెల్ చర్చలు, కేస్ ఆధారిత చర్చలు, ఆధునిక చికిత్సా విధానాలపై ఈ సదస్సులో చర్చించారు. అంతేకాకుండా ఎండోవాస్క్యులర్ సూట్, ఆపరేషన్ థియేటర్లలో ప్రత్యక్ష ప్రదర్శనలు కూడా చేశాం. ఇవి యువ వైద్యులు, మెడికల్ రెసిడెంట్లకు విలువైన శిక్షణగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ద్వారా వాస్క్యులర్ నిపుణుల మధ్య పరస్పర సహకారం పెంపొందడంతో పాటు పెరిఫెరల్ వాస్క్యులర్ వ్యాధులపై ఆధునిక చికిత్సా మార్గాలపై అవగాహన పెరిగి రోగులకు మెరుగైన చికిత్స అందే అవకాశాలు పెరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.