5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
- బ్యూరోక్రసీకి ‘వికసిత్ భారత్’పై అవసరం
- అత్యున్నతస్థాయి అధికారుల సమీక్షలో ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ, జూన్ ౩౦: ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని, బ్యూరోక్రసీకి వికసిత్ భారత్ ౨౦౭౭లక్ష్యాలపై దృష్టి అవసర మని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని సేవాతీర్థ్‌లో మంగళ వారం ఆయన కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ భేటీ దాదాపు 4 గంటలపాటు సాగింది. ఈ సందర్భగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ ప్రగతికి ప్రతిబంధకంగా మారిన పాత నిబంధనలను సడలించాలని, స్వయం సమృద్ధి సాధనపై దృష్టి సారించాలని ఆదేశించారు. పాలనలో సంస్కరణలు, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. పక్కా ప్రణాళికలతో ౨౦౪౭ నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన వికసిత్‌భారత్‌గా మార్చాలనేది తమ సంకల్పమని ఉద్ఘాటించారు.






