1 July, 2026 | 2:15 AM

బంగారు స్వామినాథం ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటాం

01-07-2026 01:17 AM

ఎంప్లాయీస్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్

ముకరంపుర, జూన్ 30 (విజయక్రాంతి): బంగారు స్వామినాథం ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటామని ఎంప్లాయిస్ రాష్ట్ర జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నారు. టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా  కార్యదర్శి సంగేం లక్ష్మణరావు ఆధ్వర్యంలో బంగారు స్వామినాథం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ హాజరై స్వామినాథం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామినాథం ఆశయాలను కొనసాగిస్తూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపెల్లి కాళీ చరణ్ గౌడ్, రాగి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు ఇరుమల్ల శారద, జిల్లా సహాధ్యక్షులు రవీందర్ రెడ్డి, పట్టణ సంఘం అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్,  తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, తదితరులు పాల్గొన్నారు.