30 June, 2026 | 2:55 AM

అమెరికా - ఇరాన్ యుద్ధానికి బ్రేక్

30-06-2026 01:55 AM
  1. ఖతార్ మధ్యవర్తిత్వంతో తగ్గిన ఇరుదేశాలు
  2. దోహాలో నేడు శాంతి చర్చలు
  3. హార్మూజ్ జలసంధిపైనే ప్రధానంగా చర్చ?

దోహా, జూన్ ౨౯ : ఖతార్ మధ్యవర్తిత్వం తో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు తాజాగా తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరు దేశాలు పరస్పరం సైనిక దాడులను నిలిపివేసేందుకు అంగీకరించాయి. ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం జరిగే శాంతి చర్చల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి.

హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకల అంశాన్ని పరిష్కరించడమే ఈ చర్చల ముఖ్య ఉద్దేశమని తెలుస్తున్నది. స్విట్జర్లాండ్‌లో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పంద చర్చలు జరిగిన కొద్ది రోజులకే మళ్లీ, మొన్నటివరకు అమెరికా, ఇరాన్ తలపడ్డాయి. పరస్పర దాడుల్లో ఇరు దేశాలు నష్టపోయాయి.

ఇరాన్‌లోని కీలక స్థావరాలను టార్గెట్ చేసుకుని అమెరికా మిస్సైల్స్ ప్రయోగించింది. అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఇరా న్ యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. అందుకే క్షిపణి, డ్రో న్, రాడార్ కేంద్రాలపై దాడులు చేసినట్లు సమర్థించుకున్నారు.

కువైట్, బహ్రాయిన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి చేసింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో యు ద్ధానికి బ్రేక్ పడింది. మరోవైపు ఈ వారం లో ఇరు దేశాల్లో భారీ కార్యక్రమాలు జరగనున్నాయి. జూలైన 4న అమెరికా తన 250 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్నది. అధ్యక్షుడు ట్రంప్ నేషనల్ మాల్ లో ప్రసంగించనున్నారు. ఇటు ఇరాన్ తన సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నది. జూలై 3 5 వరకు జరిగే ఈ అంత్యక్రియల్లో సుమారు 3.5 కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా.