1 July, 2026 | 2:17 AM

బీసీ సంఘం నాయకులు అరెస్టు

01-07-2026 01:19 AM

కరీంనగర్, జూన్ 30 (విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఎంపీ ఆర్ కృష్ణయ్య  ఇచ్చిన పిలుపుమేరకు పెండింగ్‌లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, మంగళవారం తలపెట్టిన కాలేజీల బంద్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా బీసీ నాయకులను అరెస్టు చేసి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసిపేద్ది శ్రీధర్ రాజు మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఇప్పుడు అప్పుడు చెల్లిస్తాం అంటూ ఎనిమిది వేల కోట్ల బకాయిలు విడుదల చేయకుండా పెండింగ్లో పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో మంత్రులను ఎమ్మెల్యేలను అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫీజుబకాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎంపీ ఆర్ కృష్ణయ్య  తలపెట్టిన కాలేజ్ బందులో భాగంగా బీసీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగిందన్నారు . అరెస్టు వల్ల ఉద్యమాన్ని ఆపేది లేదని విద్యార్థుల పక్షాన న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తే మాత్రం రాష్ట్ర అగ్ని గుండంగా మారుస్తామని హెచ్చరించారు. 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఆగం చేయొద్దని కోరారు. అరెస్టు అయిన వారిలో అనుమాస నితిన్, రవీంద్ర చారి, నల్లగొని శ్రీనివాస్, ముడుపు ప్రసాద్ బీసీ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.