28 August, 2026 | 10:43 PM

Breaking News

సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆధునిక సాంకేతికతలపై అవగాహన   •   స్థాయి మరచి వ్యక్తిగత, అసత్య ఆరోపణలు చేస్తే సహించము   •   ప్రభుత్వ ఐటిఐ (బాలికలు) 3వ విడత వాక్ఇన్ అడ్మిషన్లు   •   సోదరుల క్షేమాన్ని కోరుతూ.. రాఖీలు కట్టిన సోదరీమణులు...   •   ఘనంగా 44వ కొండగట్టు గిరి ప్రదక్షిణ   •   అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఆత్మీయ ప్రతీక.. రాఖీ పౌర్ణమి   •   బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు తండ్రి రామయ్య కన్నుమూత   •   నాచారం పోలీస్ స్టేషన్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహణ   •   బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మల్లారెడ్డి   •   సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఆత్రం సుగుణక్క   •  

హుస్నాబాద్‌లో స్మృతివనం ఏర్పాటు చేయాలి

01-07-2026 01:18 AM

మంత్రిని కోరిన జేఏసీ

హుస్నాబాద్, జూన్ 30: హుస్నాబాద్ అమరుల స్థూపం స్థలాన్ని కబ్జాల నుంచి రక్షించి అక్కడ ‘అమరుల స్మృతి వనం‘ ఏర్పాటు చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.

సర్వే నంబర్లు 1189, 275లోని భూమిపై విచారణ జరిపించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, సర్వాయి పాపన్న, గోనెల పాపన్న, బుచ్చవ్వ, అనభేరి ప్రభాకర్రావు తదితరుల విగ్రహాలు, తెలంగాణ అమరుల చరిత్రను ప్రతిబింబించే స్మారకాలు, క్రీడామైదానం, గద్దర్‌బెల్లి లలిత కళాభారతి, ఆడిటోరియం నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి,కో కన్వీనర్ మేకల వీరన్నాయాదవ్ తో పాటు వివిధ రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.