మహిమాన్విత క్షేత్రం శిరుసనగండ్ల
- సీతాన్వేషణలో సేద దీరిన రామలక్ష్మణులు
ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు
చారకొండ, మార్చి ౧౬ : దశరథ నందనుడు శ్రీరామచంద్రుడు నడయాడిన నేల గా, సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ సౌమిత్రితో కలిసి సేదతీరిన పవిత్ర ప్రదేశంగా ఖ్యాతి గాంచిన శిరుసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం భక్తుల పాలిట మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతోంది. రఘు రాముడి అడుగుజాడలతో పుణ్య భూమిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం అపర భద్రాద్రిగా పేరుగాంచింది. ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థా నం సిద్ధమైంది. ఉత్సవాలకు సుమారు 60 నుంచి 70 వేల మంది భక్తులు హాజరుకానున్నారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం
దండకారణ్య ప్రాంతంలో భాగంగా ఉన్న శిరుసనగండ్ల గ్రామం సమీపంలో దాదాపు 300 అడుగుల ఎత్తులో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బండపై ఈ క్షేత్రం విరాజి ల్లుతోంది. పురాణాల ప్రకారం సీతాదేవిని అన్వేషిస్తూ దండకారణ్యంలోకి వచ్చిన రామలక్ష్మణులు దత్తాత్రేయ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ సేదదీరారని చరిత్రలో చెబుతారు. త్రేతా యుగంలో రాక్షసుల తలలను తెగనరికి వాటితో ఆంజనేయుడు బంతి ఆట ఆడిన ప్రదేశం కావడంతో శిర స్సు, గండ్లు అనే పదాలు కలిసిపోయి శిరుసనగండ్ల అనే పేరు వచ్చిందని మరో కథ నం ఉంది.
రాళ్ల మధ్య నీరు నిలిచే ఎత్తున ప్రదేశం కావడం వల్ల కూడా ఈ పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. రామాయణంతో సంబంధం ఉన్న ఈ క్షేత్రం గురించి శ్రీమరి సింగకవి రచించిన శిరుసనగండ్ల రామచరిత్ర అనే పద్యకావ్యంలో సవివరంగా పేర్కొన్నారు. దాదాపు మూడున్నర శతాబ్దాల క్రితం ఆలయ ప్రతిష్ఠ జరిగినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. ఆలయంలోని గర్భగుడిలో సీతా, రామ, లక్ష్మణుల విగ్రహాలు ప్రత్యేకంగా దర్శనమిస్తాయి.
రామలక్ష్మణుల విగ్రహాలకు మీస కట్టు ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతగా భావిస్తారు. భద్రాచలానికి ప్రతిష్ఠించాల్సిన విగ్రహాలుశిరుసనగండ్ల గ్రామా నికి చెందిన భక్తుడు డేరం రామయాజ్వికు స్వప్నంలో దర్శనమిచ్చిన శ్రీరాముడు, ఖ మ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని రావిచేడు గ్రామంలో భూస్థాపితంగా ఉన్న సీతారామలక్ష్మణుల మూల విగ్రహాలను తీసు కువచ్చి ప్రశాంతమైన శిరుసనగండ్ల గుట్టపై ప్రతిష్ఠించాలని ఆదేశించాడని కథనం ఉంది. అప్పటి నుంచి ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం లేకపోవడం ప్రత్యేకతగా చెప్పబడుతోంది.
ప్రతి ఏటా శ్రీరామ నవమికి ముందు రోజు మాస కల్యాణం నిర్వ హించడం ఈ ఆలయ ప్రత్యేక సంప్రదాయం. శ్రీరామ నవమి రోజు జరిగే కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ముందురోజే మాస కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా ఎండబెట్ల గ్రామానికి చెందిన పకీరయ్య గౌడ్ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. భక్తుల సౌకర్యార్థం మామిడి, వేప, చింత చెట్లతో తోటలు ఏర్పాటు చేయడంతో పాటు నీటి కోసం పెద్ద బావి తవ్వించి కుంటను నిర్మించారు.
అభివృద్ధికి ఎదురు చూస్తున్న క్షేత్రం
శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం ఇప్పటికీ తగిన అభివృద్ధి పొందలేదని భక్తు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం పేరుపై దాదాపు 1,400 ఎకరాల సాగుభూమి ఉన్నప్పటికీ ఆదాయం సక్రమంగా సమకూర్చడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శ లు ఉన్నాయి.స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ కృషితో ఆలయ గుట్ట దిగువన రూ.2 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తి అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం కావడంతో రూ.100 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చే యాలని భక్తులు కోరుతున్నారు.
ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సంద ర్భంగా కొబ్బరికాయ లు, తలనీలాలు, ఇతర హక్కులపై నిర్వహిం చే వేలం ద్వారా వచ్చే ఆదాయం హుండీ ఆదాయంతోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నా రు.
ఈ వి ధంగా ప్రతి ఏటా సుమారు రూ.30 లక్షల వరకు ఆదాయం వస్తుందని సమాచారం. శ్రీరామ నవమి సం దర్భంగా జరిగే జానకీరాముల కల్యాణం, పెద్ద రథోత్సవంకు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అధికంగా పాల్గొనే నేపథ్యంలో 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.




