అత్యుత్సాహంలో బంకు యాజమాన్యం...
- అధికరేటుకు పెట్రోల్ విక్రయం
- పట్టించుకోని సంబంధిత అధికారులు
- యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటున్న వాహనాదారులు
ధర్మపురి,జూన్12(విజయక్రాంతి): పెట్రోల్ బంకుల్లో అధికారుల పర్యవేక్షణ కరువైంది.ఎప్పటికప్పుడు పెట్రోల్ బంకులపై నిఘా ఉంచాల్సిన సంబంధిత అధికారులు అటువైపు చూడకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉదసీనతగా వ్యవహరించడంపట్ల పెట్రోల్ వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనితో పెట్రోల్ బంక్ ల యాజమాన్యాలు తమ ఇష్టరీతిగా వ్యవహారిస్తున్నాయి.
తాజాగా గొల్లపల్లి మండలకేంద్రంలోని ధరణి ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం పెట్రోల్ వినియోగదారులపట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లాంఘిస్తూ లీటర్ పెట్రోల్ రేటును రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రూ.125.40లకు విక్రయిస్తూ దిక్కున్నచోట చెప్పుకోండి మాఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతాం అంటూ పెట్రోల్ వినియోగదారులపట్ల బంకు యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు.
వేరే బంకులో లీటర్ పెట్రోల్ ధర రూ.116.40 ఉంటే ఇందులో మాత్రం అదనంగా లీటర్ పై రూ.10 వసూల్ చేయడం పట్ల పెట్రోల్ వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు ఇప్పటికైనా పెట్రోల్ బంక్ ల పై నిఘా ఉంచి వినియోగదారులకు న్యాయం చేయాలని వాహనాదారులు కోరుతున్నారు.
అధిక వసూల్ దోపిడీని అరికట్టాలి:శ్రీను,పెట్రోల్ వినియోగదారుడు
గొల్లపల్లి మండల కేంద్రంలోని ధరణి పెట్రోల్ బంక్ యాజమాన్యం లీటర్ పెట్రోల్ పై ఏకంగా10 రూపాయలు అదనంగా వసూలు చేసింది. ఇదేంటని అడిగితే మీ ఇష్టం ఉన్నచోట చెప్పుకోండి అంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు అధికారులు స్పందించి ధరణి పెట్రోల్ బంక్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని వాహన వినియో గదారులకు న్యాయం చెయ్యాలి.
విచారణ చెడుతాం
గొల్లపల్లి మండల కేంద్రంలోని ధరణి పెట్రోల్ బంక్ పై విచారణ చేపడ తాం. నిజముగానే పెట్రోలు ను అధిక రే టుకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలకోసం పై అధికారులకు నివేదిక సమర్పి స్తాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎ క్కడా పునరావృతం కాకుండా తప్పకుం డ కఠిన చర్యలు తీసుకుంటాం. సమస్యలు వచ్చినప్పుడు వాహనదారులు నిర్భయంగా ఫిర్యాదు చెయ్యొచ్చు.
శ్రీనివాస్,సివిల్ ఎస్‌ఐ ఆర్‌ఐ






