బక్రీద్ పండుగ ఐక్యతకు చిహ్నం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్ మే 28 : బక్రీద్ పండుగ ఐక్యతకు చిహ్నమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా న్యూ గంజ్, రహమానియా ఈద్గా దగ్గర జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే పాల్గొని, ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగానికి, నిస్వార్థ సేవకు ప్రతీక అని చెప్పారు.
ఈ పర్వదినం మనలో సేవాభావం పరస్పర సహకారం వంటి విలువలతో కులమతాలకు అతీతంగా స్నేహపూర్వకంగా సహనంతో జీవిద్దామని ఆయన పిలుపునిచ్చారు. మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు షబ్బీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.






