3 March, 2026 | 2:02 AM

ఉన్న గుడిసె పోయే...ఇంటి నిర్మాణం కాకాపాయే..

03-03-2026 12:00 AM
  1. ఇందిరమ్మ... నీ ఇండ్ల బిల్లులు ఎప్పుడమ్మ ..?

అప్పులు చేసి పక్క గృహాలు నిర్మించిన చేతికి అందని బిల్లులు

అగమ్యగోచరంగా లబ్ధిదారుల బతుకులు 

ఉట్నూర్, మార్చి 2 (విజయక్రాంతి): ఉన్న గుడిసెను తొలగించి, అప్పులు చేసి పక్క ఇంటి నిర్మాణాలు చేపడితే బిల్లులు రాక.. ఉన్న గుడి సె లేక... ఇంటి నిర్మాణం పూర్తి కాకా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బతుకులు అగమ్య గోచరంగా మారింది.  పేదల స్వంత ఇంటి కల సహకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణాలకు జిల్లాలో బిల్లుల గ్రహణం పట్టుకుంది.

బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడంతో డబ్బుల కోసం లబ్ధిదారులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణం కోసం పంచాయతీ అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు  గ్రామాలకు వచ్చి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించుటకు మార్కింగ్ ఇచ్చి  ఆన్లైన్‌లో లబ్ధిదారుల పూర్తి వివరాలు నమోదు చేశారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ అప్పులు చేసి, ఉన్న పశువులను అమ్మి ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు. పునాదులతో పాటు రూప్  లెవెల్ వరకు ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసుకున్నారు.

చేసిన అప్పులు తీర్చుకున్నందుకు, మిగతా ఇంటి పనులు పూర్తి చేసేందుకు బిల్లులు మంజూరు చేయాలని అధికారుల వెంట తిరిగిన  బిల్లులు రావ డం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు మం జూరైన లబ్ధిదారులు  బేస్మెంట్ నిర్మించుకుంటే రూ.1 లక్ష రూపాయల బిల్లు ఇస్తామని, రూప్ లెవెల్ వరకు ఇంటి నిర్మాణం పూర్తయితే రూ.2 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేటికీ బిల్లులు

చేతికి రావడం లేద ని జిల్లా ఏజెన్సీలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలతోపాటు అదిలాబాద్ రూరల్ మండలం, సిరికొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్  తదితర మండల పరిధిలోని గ్రామాల్లో మం జూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించిన లబ్ధిదారులు గత మూడు నాలుగు నెలల నుండి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికా రులు చర్యలు తీసుకొని ఇందిరమ్మ బిల్లులు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

ఎల్ 1లో  మంజూరు... ఎల్3లో నమోదు

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద గిరిజనులతో పాటు పేదలను గుర్తించి ఎల్ 1 జాబితాలో ఉన్న అర్హులైన వారికి మొదటి విడతగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు  పంచాయతీ కార్యదర్శులు ఇంటి నిర్మాణానికి అను మతులు ఇస్తూ, వారి చిత్రాలను ఆన్లైన్లో ప్రభుత్వానికి పంపించారు. ఇంటి బేస్మెంట్  పను లు పూర్తయిన తర్వాత పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి  బేస్మెంట్‌తో పాటు లబ్ధిదారుల  చిత్రాలను ఆన్లైన్లో పంపించారు. దశలవారీగా జరుగుతున్న ఇంటి నిర్మా ణం పనులను పంచాయతీ కార్యదర్శులతో పాటు మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేసి బిల్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.

గ్రామస్థాయి, మండ ల స్థాయి అధికారులు  పంపించిన బిల్లుల నివేదికలను ఉన్నత అధికారులు పర్యవేక్షణ చేస్తూ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో బిల్లులు చెల్లించవలసి ఉంది. కానీ ఇందిరమ్మ ఇంటి మంజూరు సమయంలో ఎల్ 1లో నమోదు ఆయన లబ్ధిదారుల పేర్లు  ఎల్ 3లో చేరడం తో బిల్లులు రావడం లేదని  లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తప్పిదాల వల్ల అప్పులు చేసి బిల్లుల కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నామని లబ్ధిదారులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చేసిన తప్పిదాలను ఉన్నతాధికారులు సరిచేసి బిల్లు లు అందిస్తే ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుంటామని  లబ్ధిదారులు కోరుతున్నారు. 

అప్పు చేసి ఇల్లు కట్టుకున్న.. 

ఇంద్రవెల్లి మండలం సమాకా పంచాయతీ పరిధిలోని మారుతి గూడలో కొలం గిరిజన కుటుంబాలకు 16 ఇండ్లు మంజూరయ్యాయి. గ్రామస్తులందరం కలిసి ఇంది రమ్మ ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించాం. గూడెంలోని 15 కుటుంబాల వారికి రెండు విడతలుగా బిల్లు వచ్చింది. లక్ష యాభై వేలు  అప్పుచేసి రూప్ లెవెల్ వరకు ఇంటి నిర్మాణం పనులు పూర్తిచేసిన, నేటికీ బిల్లు రావడం లేదని రాంబాయి వాపోయింది. ఇంటి బిల్లు కోసం అధికారుల చుట్టూ తిరిగిన బిల్లు రావడం లేదు. బిల్లు కోసం తిరగడానికి రూ. 5000 ఖర్చయింది.

 మడవి రాంబాయి,  మారుతి గూడ.

అధికారులు కనికరింస్తలేరు..

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో అప్పుల పాల య్యాను. బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగిన అధికారులు కనికరించడం లేదు. ఇప్పటికైనా బిల్లు అందిస్తే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటా.

 చక్రం రాంబాయి, మార్కాగూడ

పశువులను అమ్ముకున్న..

ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు  చేయగానే సంతోష పడ్డ... వర్షాకాలంలో భారీ వర్షాలకు తన ఇల్లు కూలిపోయింది. మండల అధికారులు వచ్చి కూలిన ఇల్లును పరిశీలించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూ రు చేశారు. మంజూరైన ఇంటి నిర్మాణం కోసం పశువులను అమ్ముకోవాల్సి వచ్చిం ది.

ఇంటి నిర్మాణానికి స్లాబ్ లెవెల్ వరకు పిల్లర్లు వేసుకుని బిల్లుల కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నా. బిల్లులు నేటికి రావడం లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు సమయంలో ఎల్ 1 జాబితాలో తన పేరు ఉంది, బిల్లు కోసం తిరుగుతే ఎల్ 3 జాబితాలో  పేరుంది బిల్లు రాదని  అధికారులు అంటున్నారు. ఇసుక సిమెంట్ వ్యాపారి వద్ద అప్పుగా తీసుకువచ్చాను. 

 సునీత, మార్కాగూడ  

అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం 

ఇంద్రవెల్లి మండలంలో పి.వి.టి.జి  లబ్ధిదారులతో పాటు ఎల్ 1 జాబితాలో  ఉన్న లబ్ధిదారులకు 1,076 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు సకాలం లో బిల్లులు వస్తున్నాయి. కానీ మండలంలోని 76 మంది లబ్ధిదారులకు బిల్లులు రాలేదు.

ఈ విషయా న్ని కలెక్టర్‌తో పాటు ఇతర అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం.. లబ్ధిదారుల జాబితాలో ఎల్ 3 నమోదు కావడంతో ఈ సమస్య వచ్చింది. ఈ సమస్యను త్వరలో పరిష్కారం చేసి బిల్లు లు అందేలా చర్యలు తీసుకుంటాం.

 జీవన్‌రెడ్డి, ఎంపీడీవో, ఇంద్రవెల్లి