26 August, 2026 | 6:10 PM

నేపాల్‌ ప్రధాని బాలెన్ షాతో మాట్లాడిన ప్రధాని మోదీ

26-08-2026 05:20 PM

న్యూఢిల్లీ: నేపాల్‌లోని భోటే కోషి నదిలో ఆకస్మికంగా సంభవించిన వరద ప్రవాహంపై నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. పొరుగు దేశంలో సంభవించిన వినాశకరమైన వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుబాలకు ఆయన తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో నేపాల్‌కు సాధ్యమైనంత మానవతా, సహాయక చర్యల రూపంలో భారత్ పూర్తి మద్దతును అందిస్తుందని ప్రధాని మోదీ షాకు హామీ ఇచ్చారు.

ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌లోని నా సోదర సోదరీమణులకు భారతీయులందరూ అండగా నిలుస్తారని, నేపాల్‌కు సాధ్యమైనంత మేర మానవతా దృక్పథంతో కూడిన సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. సహాయక, పునరావాస చర్యల విషయంలో మా బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని,  'ఎక్స్' వేదికగా ప్రధాని మోదీ పోస్ట్‌ చేశారు.