మహిళలు అన్నిరంగాలలో రాణించినప్పుడే దేశం సమగ్ర అభివృద్ధి
- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
- హైదరాబాద్ నుంచి లడక్‌కు బైక్ రైడింగ్ చేసిన బాంధవికి సన్మానం
ముషీరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పుడే దేశం సమగ్ర అభివృద్ధి చెందుతుందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం ముషీరాబాద్ డివిజన్ కళాధర్ నగర్ కు చెందిన ఎల్‌ఎల్ బీ చదువుతున్న విద్యార్థినీ మెట్టు బాంధవి ఈ నెల 11న హైదరాబాద్ నుండి లడక్ కు మొటర్ సైకిల్ పై సాహ యాత్రను పూర్తి చేసిన బాంధవిని బండారు దత్తాత్రేయ వారి ఇంటికి వెళ్లి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధైర్యసహసాలతో మోటర్ సైకిల్ పై సాహసయాత్రను పూర్తి చేయడం అభినందనీయం అని ప్రశంసించారు. నేటి యువత ఆమెను స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. బాలికలు అధైర్యపడకుండా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తూ రాష్ట్ర, దేశ ప్రతిష్టను పెంపొందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్, ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, పార్టీ నాయకులు లక్ష్మణ్, రాజు, వాసు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.






