కారెగాం తండాలో పట్టపగలే చోరీ
బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరణ
బాన్సువాడ, ఆగస్టు 26 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం కారెగాం తండాలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని అనిత ఇంటికి తాళం వేసి పక్కింటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి బీరువా తాళం పగులగొట్టి ఉండటంతో పాటు ఇంట్లోని దుస్తులు చిందరవందరగా కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి బీరువాను పరిశీలించగా అందులోని సుమారు 2.5 తులాల బంగారం, 28 తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష వరకు నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తూ ఆధారాల సేకరణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.






