యూరియా యాప్ తో రైతులకు కష్టాలు
ముస్తాబాద్,ఆగస్టు 26( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నాఫ్స్కోబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు హాజరై మాట్లాడారు.
యూరియా కోసం రైతులు ఆప్ తో నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.యాప్ ద్వారా యూరియా అందుతుందని చెబుతున్న అధికారులు, రైతులు మాత్రం గంటల తరబడి ఫోన్ లతో ప్రయత్నం చేస్తున్నప్పటికి యూరియా బ్యాగులు బుక్ కావడం లేదని ఒక వేళ బుక్ అయినా స్టాక్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.ఫోన్ ఎలా వాడాలో రైతులకు అర్థం కావటం లేదని రైతులు పంట నష్ట పోయి ఆర్థికంగా మానసి ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.ఈ సమస్య పై
రైతులను ఇబ్బంది పెట్టకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి యూరియా కొరత లేకుండా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి,పార్టీ పట్టణ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, జిల్లా మాజీ కో అప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, మాజీ పట్టణ అధ్యక్షులు సంతోష్ రావు,భరత్,మాజీ సర్పంచ్ నర్సయ్య, యూత్ అధ్యక్షుడు స్వామి, నాయకులు కోడె శ్రీనివాస్, గణేష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.






