26 August, 2026 | 6:02 PM

మంచరామిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

26-08-2026 04:59 PM

సుల్తానాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలో ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ ఉప్పు లక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు పాల్గొని ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సర్పంచు ఉప్పు  లక్ష్మి తెలిపారు.