26 August, 2026 | 6:03 PM

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్ యువకుడి మృతి

26-08-2026 05:03 PM

బోధన్,ఆగస్టు 26 (విజయ క్రాంతి): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాదు చెందిన యువకుడు మృతి చెందాడు. ఫ్లోరిడాలో జరిగిన యాక్సిడెంట్లో తెలంగాణకు చెందిన ముగ్గురు మరణించారు. వారిలో నిజామాబాద్ శివారులోని గూపన్పల్లికి చెందిన హరిబాబు, నాగమణి కుమారుడు రాహుల్ చనిపోయాడు. అతను మూడు నెలల క్రితం ఎంఎస్ చదవడానికి అమెరికాకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.