26 August, 2026 | 5:44 PM

కోటగుళ్లు గోశాల గోమాతలకు పశుగ్రాసం వితరణ

26-08-2026 04:55 PM

గణపురం, ఆగస్టు 26(విజయ క్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు గోశాల గోమాతలకు గణపురం మండల కేంద్రానికి చెందిన దుగ్యాల స్వరూప, నర్సింగరావు దంపతులు బుధవారం ప్రశుగ్రాసాన్ని అందజేశారు. కోటగుళ్ళు గోశాల గోమాతలకు పశుగ్రాసాన్ని అందజేసిన నర్సింగరావు స్వరూప దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.