31 August, 2026 | 10:20 PM

Breaking News

శ్రీరంగాపూర్‌లో శాస్త్రవేత్తల క్షేత్ర సందర్శన   •   బిజెపి మహా దీక్షను విజయవంతం చేయాలి   •   కొమరం భీమ్ నగర్ గ్రామంలో త్రాగునీటి సమస్య కు పరిష్కారం చూపండి   •   ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్యం   •   ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే జాగో తెలంగాణ యాత్ర   •   ఆదివాసి బిడ్డ శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలి   •   సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి   •   పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి   •   బిజెపి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి   •   మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి   •  

పేదోళ్ల సొంతింటి కల నెరవేరుతుంది

15-05-2026 02:14 AM

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, మే 14 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పేదోళ్ల సొంతింటి కల నెరవేరుతుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని కొత్త గుండ్లపల్లి గ్రామంలో  గుండ్లపల్లి సత్యం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా ప్రభుత్వం నిర్మించిన ఇంటిని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. అనంతరం  దంపతులకు పట్టు వస్త్రాలు, నగదును అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదోళ్ల కోసం  ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, 200ల యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళ లకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం లాంటి అనేక సంక్షేమ పథకాలను అందజేస్తూ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఆలేరు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి రాష్ట్రంలోనే ఆలేరును  ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కౌన్సిలర్లు పేర బోయిన సత్యనారాయణ యాదవ్, ముక్కెర్ల మల్లేష్ యాదవ్, బూడిద మధు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతిగౌడ్, మాజీ ఉపసర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్  పాల్గొన్నారు.