ఉరి వేసుకుని వ్యక్తి మృతి
15-05-2026 02:13 AM
తుంగతుర్తి, మే 14 : ఓరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని గొట్టిపర్తి ఆవాస ప్రాంతమైన బాపన్ భాయ్ తండా వద్ద గురువారం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం వస్రం తండాకు చెందిన భూక్య పంతులు(50) మానాపురం తండా వివాహానికి హాజరైనట్లు తెలిపారు.
అక్కడ భార్యతో గొడవపడి, మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై బాపన్ భాయ్ తండా వద్దకు వచ్చి చెట్టుకు ఉరి వేసుకొని, మృతి చెందాడన్నారు. కుమారుడు భూక్య వెంకన్న ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహంను ప్రభుత్వ దావకానికి తరలించినట్లు ఎస్త్స్ర క్రాంతి కుమార్ తెలిపారు.






