7 July, 2026 | 3:36 PM

Breaking News

పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •   అన్ని వర్గాల ప్రజలకు అండగా ఎమ్మార్పీఎస్   •  

‘సర్’ ఫారాల పంపిణీ గడువులోగా పూర్తి చేయాలి

07-07-2026 12:00 AM

ఈఆర్‌ఓ వికాస్ మహతో నాగోల్, జీఎస్ డివిజన్లలో పర్యటించి పంపిణీ ప్రక్రియను పరిశీలించిన ఎల్బీనగర్ జోనల్ కమిషనర్

నాగోల్, జూలై 6 (విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు గణన ఫారాల పంపిణీని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్‌ఓ) వికాస్ మహతో సంబంధిత బూత్ స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం నాగోల్, జీఎస్ డివిజన్ల పరిధిలోని గణేష్ నగర్, కృష్ణనగర్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.

ప్రతి అర్హ ఓటరికి సకాలంలో ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పంపిణీ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే టోల్ఫ్రీ నంబర్లను సంప్రదించి పరిష్కారం పొందాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు.