గోమాత వైభవం ప్రవచనం అద్భుతం
ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు చాగంటి
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
ఇందూరు, జూలై 24 (విజయక్రాంతి): లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ అన్నారు. ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నగర శివారులోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ‘గోమాత వైభవం’పై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ చాగంటికి ఘనస్వాగతం పలికి సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన అద్భుతమైన ప్రవచనాలతో రామాయణం, భారతం, భాగవతం వంటి మహా గ్రంథాల్లోని విలువలను సామాన్యులకు సుల భంగా అర్థమయ్యేలా ఆయన వివరిస్తున్నారన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కుటుంబ విలువలు, ధర్మం గొప్పతనాన్ని నేటి తరానికి చేరవేయడంలో ఆయన చేస్తున్న సేవ అమూల్యమైందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు చాగంటి చేస్తున్న యజ్ఞం ఎంతో గొప్పద్దన్నారు. అలాగే ఇం దూరులో గోమాత వైభవం పై ప్రవచనం చెప్పడానికి రావడం ఇక్కడి భక్తుల పూర్వ జన్మ సుకృతం అన్నారు. సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉందని, ముక్కోటి దేవతలను గోవులో చూస్తామన్నారు. కార్యక్రమంలో ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.






