calender_icon.png 6 February, 2026 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

06-02-2026 12:00:00 AM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం రాంనగర్ డివిజన్లోని పవిత్ర నగర్‌లో రూ. 62 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు, ముషీరాబాద్ డివిజన్లోని అజార్ గల్లీలో రూ. 15 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ కె. రవి చారి, మాజీ కార్పొరేటర్ కల్పన యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు కోట్లాది రూపాయలతో తాగునీటి, డ్రైనేజీ, సిసి రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు తదితర అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ముషీరాబాద్, రాంనగర్ డివిజన్ల అధ్యక్షులు కొండా శ్రీధర్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, ముషీరాబాద్ సర్కిల్ డీఎంసీ ప్రవీణ్ కుమార్‌రెడ్డి, డిఇ గీత, బీఆర్‌ఎస్ మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, శివ ముదిరాజ్, సోమన్, నరసింగరావు, ఎర్రం శేఖర్, బీజేపీ నేతలు నవీన్ కుమార్ గౌడ్, బద్రి నారాయణ, కాంగ్రెస్ నాయకులు అరవింద్ కుమార్ యాదవ్, పెండెం శ్రీనివాస్, పట్నం నాగభూషణం, జిహెచ్‌ఎంసి ఏఈలు తదితరులు పాల్గొన్నారు.