06-02-2026 12:00:00 AM
ఆస్పత్రి పాలైన నిరుపేద కుటుంబం
సాయం కోసం ఎదురుచూపు..
పాల్వంచ, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): అసలే వారిది నిరుపేద కుటుంబం.. ఆపై మోయలేని భారంగా అనారోగ్య సమస్యలు... రెక్కాడితే గాని డొక్కాడని జీవితం. ఆ కుటుంబాన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. తల్లి గుండె సంబంధిత వ్యాధితో పోరాడుతుంటే.. తనయుడు మరో వింత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు .ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు. సరైన వైద్యం చేయించుకోవాలనుకున్న చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో మంచానికి పరిమితమయ్యారు. తమ వద్ద ఉన్న డబ్బులతో ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న, సరైన వైద్యం అందాలంటే రూ లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. ఎవరైనా సాయం చేయకపోతారా, ఆపన్న హస్తము అందించి తమను ఆదుకోకపోతారానీ ఎదురుచూస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
పాల్వంచ మండలం పుల్లయ్య గూడెం గ్రామానికి చెందిన కాశీమల్ల కమలాకర్ అనే వ్యక్తి పెంకియాన్ ప్రాబ్లం అనగా శరీరంలో నీటి శాతం ఎక్కువై పల్స్ రేట్ పడిపోతూ ఉంటుంది. దీంతో తాను మంచానికి పరిమితం అయ్యాడు. ఇలా ఇతనికి నాలుగోసారి జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అతని తల్లి గుండె సమస్యతో బాధపడుతూ స్టంట్ వేయాలని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే కూలినాలు చేసుకుంటేనే కానీ పూట గడవని ఆ కుటుంబం పై పెనుబారంలా అనారోగ్య సమస్యలు వచ్చి పడ్డాయని స్థానికులు ఆవేదన చేరుతున్నారు. ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి సహాయం అందించాలని వేడుకుంటున్నారు. 9010255365 నెంబర్కు ఫోన్ పే ద్వారా కమలాకర్ కు అందజేయాలని కోరుకుంటున్నారు.