5 July, 2026 | 3:13 AM

పాపాల భైరవుడు మళ్లెందుకు రావాలె?

05-07-2026 01:38 AM

వస్తే రాష్ట్రాన్ని మళ్లీ దోచుకుంటరు

పాలమూరు బిడ్డను..మరువను ఈ గడ్డను!

కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌కు ఫామ్‌హౌస్‌లు ఎట్లొచ్చాయ్?

  1. లక్షల కోట్లు ఎక్కడివి ? ఏం వ్యాపారం చేశారు?
  2. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము కాదా?
  3. ఇక సంతోష్‌రావు ఆస్తులైతే చెప్పేటట్టే లేవు
  4. పశుపతిని ఫాంహౌస్‌లో బంధించాం..!
  5. ఎప్పటికీ బయటకు రాడు.. ఏదైనా ఉంటే గతమే
  6. మిడ్జిల్ కృతజ్ఞత సభలో సీఎం రేవంత్‌రెడ్డి
  7. 20 ఏళ్లుగా ప్రజా గొంతుకగా ఉన్న
  8. పాలమూరు బిడ్డలు పాలకులు గానూ పనికొస్తారని నిరూపించా..
  9. మిడ్జిల్ అభివృద్ధి బాధ్యత తనదేనని స్పష్టీకరణ

* 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. వలసల జిల్లాను అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత నాపై ఉంది. తట్ట పనికి, పార పనికి పాలమూరు బిడ్డలే అవసరమైనప్పుడు.. పరిపాలనకు ఎందుకు పనికిరారు. మిడ్జిల్ మండల ప్రజలు ఆనాడు తీసుకున్న నిర్ణయమే నేడు నన్ను సీఎంగా నిలబడేలా చేసింది. రాష్ట్ర ప్రజల కోసం ఎంతో చేస్తున్న. ప్రజలు కేసీఆర్‌కు ఎమ్మెల్యేగా ఉద్యోగం ఇచ్చారు. కానీ, అసెంబ్లీకి మాత్రం రారంట.. ఇదెక్కడి పద్ధతి. ఆయన మరోసారి అధికారంలోకి వస్తే భార్యాభర్తల ఫోన్లు వింటడు. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్ జూలై 4 (విజయక్రాంతి): ‘పాపాలభైరవుడు మళ్లీ రావాలంట. వస్తే ఏం చేస్తడు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజల సొమ్ము దోచుకోలేదా?. గజ్వేల్ ఫామ్‌హౌస్ ఎకరాల కొద్దీ ఎక్కడి నుంచి వచ్చింది, మీ తాత ముత్తాతలు ఇచ్చారా? నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్నది కాదా? మీ కొడుకుకు జన్వాడలో 100 ఎకరాలు, నీ అల్లుడు హరీశ్ రావుకు మొయినాబాద్‌లో 50 ఎకరాలు, నీ బిడ్డ కవితకు శంకర్‌పల్లిలో 25 ఎకరాల ఫామ్‌హౌస్‌లు ఏ విధంగా వచ్చాయి.

నీ శడ్డకుని కొడుకు సంతోష్‌రావు ఆస్తుల లెక్కలు చెప్పేటట్టే లేవు. ఈ ఆస్తులన్నీ పదేళ్లలోనే ఎక్కడి నుంచి వచ్చాయి?. ఏడ సంపాదించారు, ఏం వ్యాపారం చేశారు’ అని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అరుంధతి సినిమాలో పశుపతిని ఎలాగైతే బందీఖానా చేశారో తెలంగాణ ప్రజలు పాపాయిల భైరవుడిని ఫామ్‌హౌస్‌లో గొలుసులతో కట్టేశా రని, అక్కడే ఉండాలన్నారు. మరోసారి అధికారంలోకి రావడం అనేది కలలో మాట, ఇది ఎప్పటికీ జరగదన్నారు. ఏదైనా మీకు ఉందంటే అది గతమేనని, భవిష్యత్తు లేదన్నారు.

మీ భవిష్యత్తుకు ప్రజలు శాశ్వతంగా ముగింపు పలికారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా శనివారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో కృతజ్ఞతాభివందన సభ ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆత్మీయులను సీఎం రేవంత్‌రెడ్డి పలకరించారు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన మిత్రులు, పెద్దలను.. రాజకీయాల్లో తనతో పాటు పనిచేసి న వారిని పేరుపేరునా పలకరించారు.

నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ పేట ఆంజనే యస్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఈ సందర్భంగా మిడ్జిల్ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..  కేసీఆర్ ఇండ్లు ఇవ్వలే, నీళ్లు ఇవ్వలే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఎందు కు మరి మీరు రావాలి అని ప్రజలు అంటున్నారని ప్రశ్నించారు. అల్లుడు, కొడుకును మంత్రులు చేశారని, బిడ్డను ఎంపీ చేశారని, మందులు అందించే శడ్డకుని కొడుకుని రాజ్యసభ సభ్యుడిగా చేశారని, వారి చుట్టాలను వినోద్‌రావుతో పాటు పలువురిని వివిధ హోదాలు ఇస్తూ అవకాశం కల్పించారన్నారు.

ఓడిపోతే ప్రభుత్వ సలహాదారులుగా చేశారని, ఎందుకే వారు గుండె లు బాదుకుని రావాలి మా పాపాల భైరవుడు అంటున్నారని పేర్కొన్నారు. చూపిం చుకోవడానికి టీవీ రాసుకోవడానికి పేపర్ చప్పట్లు కొట్టడానికి భజనపరులను ఇచ్చారని అందుకోసం వారు రావాలంటున్నారని విమర్శించారు. ప్రజా పాలనపై దావత్, పెళ్లికి పోయిన, బీర్ షాప్‌కు బార్ షాప్‌కు ఎక్కడికి పోయినా ఎక్కడికిపోయినా ఈ ప్రజాపాలన ఎందుకు పోవాలి? ఆ పాపాల భైరవుడు ఎందుకు రావాలని చర్చ పెట్టాలని సూచించారు.

రేషన్‌కార్డు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, రైతుభరోసాతో పాటు పలు పథకాలు ఇస్తున్నందుకు ఈ ప్రజాపాలన పోవాల్నా అని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అని ఆనాడు వారు పేర్కొన్నారని, రెండు కోట్ల 88 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేశామన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మేవారిని బొక్కలో వేశామని, మీరు వస్తే ఫామ్ హౌస్ లలో మాదక ద్రావ్యలను మార్కెట్లో అమ్మేస్తారని విమర్శించారు.

వారితోపాటు కోట్ల రూపాయలు సంపాదించిన అధికారులు సైతం 100 200 కోట్ల రూపాయలతో ఏసీబీ వారికి ప ట్టుపడుతున్నారని విమర్శించారు. గ్రూప్ పరీక్ష పత్రం అమ్ముకొని లక్షలాది మందికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ర్టం అప్పుల పాలైందని నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేవని, రైతులు ఆత్మహత్యలు చేసుకు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలు ఇచ్చిన అందులో కమీషన్ తీసుకున్నారని, ఆ చీరలు తీసుకొని పొలాల దగ్గర కంచెలు కట్టారని విమర్శించారు. 

ప్రతి నెల 5600 కోట్లు ఖర్చు పెడుతున్నామని, పదేళ్లలో మీరు ఖర్చు పెట్టింది ఎంతో చెప్పాల న్నారు. పదేండ్లలో  రూ 8లక్షల21 వేల కోట్ల ను అప్పులు ఎట్లా అయ్యాయని, లక్ష కోట్లు కేసిఆర్ ఎలా సంపాదించారని, రాష్ర్టం ఎం దుకు అప్పుల పాలైందని ప్రజలు ప్రశ్నించాలన్నారు. కేసీఆర్ మరోసారి వస్తే భార్యాభ ర్తలు మాట్లాడుకుంటే కూడా వారు వింటారని ఇప్పుడే ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి చెప్పారని వారు ఇంతకు మనుషులా పశువులా అని విమర్శించారు.

రాజకీయ నాయకులు, అధికారుల మాటలు వింటే ఏదైనా అవసరం ఉంటుందో అనుకోవచ్చని ఆడబిడ్డల మాటలు ఎందుకు వింటారని వారు ఇం తకు మనుషులేనా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ చీర అందిస్తే ఎంతో ఆనందంగా కట్టుకొని తమను ఆశీర్వదించేందుకు వచ్చారని చెప్పారు.  ప్రజలు ఎమ్మెల్యేగా ఉద్యోగం ఇచ్చారని అసెంబ్లీకి మాత్రం రారంట అని, కేవలం అధికారంలోకి వస్తేనే మాట్లాడుతారంట ఇదెక్కడి పద్ధతి అన్నారు.  

ఒక్కరోజు సెలవు తీసుకోలే..

ఏది చేసిన ప్రజల మంచి కోసమే చేశారని ప్రతిపక్షంలో ఉంటే ప్రజా గొంతుకగా ఉండి ఒక్కరోజు కూడా సెలవు లేకుండా గత 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నాని సీఎం రేవం త్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు దీర్ఘకాలికంగా సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్య లను పరిష్కరించేందుకు అడుగులు వేస్తున్నానన్నారు. ఎమ్మార్పీఎస్ నేతలు తమతో కలిసి పనిచేశారని వర్గీకరణకు తమకు అవకాశం వచ్చిన వెంబడే చేయడం జరిగింద న్నారు.

మన దేశంలో కోడి పిల్లలకు లెక్క ఉందని,1931లో బ్రిటిష్ రాజ్యంలో బడుగు బలహీన వర్గాలను లెక్కపెట్టారని అప్పటి నుంచి ఇప్పటివరకు జనాభా లెక్కలు చేయలేదని జనగణలో కులగన చేసి ఎవరు ఎంత ఉన్నారో వారికి అవసరమైన కేటాయింపు లు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. పాలమూరు బిడ్డలు పరిపా లనకు పనికి రారని ఎందుకు అనుకుంటున్నారని తట్ట పనికి, పార పనికి పాలమూరు బిడ్డలే అవసరమైనప్పుడు పరిపాలనకు ఎం దుకు పనికిరారని ప్రశ్నించారు.

అహంకారానికి, అహంభావనికి హద్దు ఉంటుందని, గద్దర్ అన్నను గడిల ముందు ఎర్రటి ఎం డకు గంటల తరబడి నిలబెట్టారని ఇది క్షమించరాని తప్పన్నారు. గద్దర్ అన్నను అవమానించిన మీకు ఉరిశిక్ష వేసిన తక్కువేనని ప్రజలను అడుగుతున్నానన్నారు. రా ష్ర్టంలో ఈ ప్రభుత్వము అడిగిన ప్రతి బిడ్డకు రేషన్ కార్డు అందించడం జరిగిందని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇచ్చిం ది వాస్తవం కాదా అన్నారు. 4.50 ఇండ్ల ను ఇవ్వడం జరిగిందని మరో సారి ప్రతి నియోజకవర్గానికి ఇండ్లు కేటాయించడం జరిగిం దన్నారు.

ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతోపాటు రూ 21 వేల కోట్ల తో రైతు రుణమాఫీ,200 యూనిట్ల లోపు ఉచి త విద్యుత్ అందిస్తున్నామని,రూ 36 వేల కోట్ల ను రైతు భరోసా అందిస్తున్నామన్నారు. రూ 80 వేల కోట్లను వడ్లు కొనేందుకు ఖర్చు చేశామన్నారు. ఉచిత విద్యుత్ కోసం మరో 30 వేల కోట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖర్చు చేయడం జరిగిందన్నారు. రూ 1 లక్ష 76వేల కోట్ల ను ఈ 30 నెలల కాల వ్యవధిలో ఖర్చు చేయడం జరిగిందన్నారు. పదేళ్లలో నేరెడ్ల గడ్డలు ఇసుక లారీలకు అడ్డంపడితే లారీలతో తొక్కించారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే ఖమ్మం జిల్లాలో గిరిజనులకు బేడీ లేసి జైలుకు పంపించారని విమర్శించారు. 

మిడ్జిల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

మిడ్జిల్ మండలానికి తమ ప్రాణం ఇచ్చినా తక్కువే అవుతుందని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.47.08 కోట్లతో మిడ్జిల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్లతో ఊరుకొండపేట శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ.20 కోట్లతో పాత మిడ్జిల్ మండలంలోని 40 గ్రామ పంచాయతీల అభివృద్ధికి, రూ.17,08, 45000 వ్యయంతో మిడ్జిల్ మండలంలో చెక్‌డ్యామ్‌ంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

సభా ప్రాంగణానికి వస్తున్న సమయంలో ప్రజలకు కరాచాలనం చేస్తూ వేదిక దగ్గరికి చేరుకున్నారు. జయ జయహే తెలంగాణ పాట సభ ప్రాంగణం గొంతు కలి పారు. మిడ్జిల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధ్యాపా గోపాల్ రెడ్డి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఉరుములు, మెరుపులు ఉన్నా ఇక్కడ కు రావడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. హైదరాబాద్ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా పాలమూరు జిల్లా వాసి బూర్గుల రామకృష్ణారావు తో మన జిల్లాకే మొదటి అవకాశం వచ్చిందన్నారు. ఉత్తమ పార్లమెంటరీన్ అతి చిన్న వయసులోనే దివంగత నేత జైపాల్ రెడ్డికి ఎంతో గౌరవం దక్కిందన్నారు.

రాష్ట్ర, కేంద్రం లో ఆయనకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉండి దివంగత డ్యాపా గోపాల్ రెడ్డి అండగా నిలిచారన్నారు. మిడ్జిల్ మండలం ప్రజలు ఆనాడు తీసుకున్న మీ నిర్ణయమే ఈనాడు మీ ముందు సీఎంగా నిలబడేలా చేసింది అన్నారు. ఆనాడు రబ్బాని గెలిచి ఉంటే జెడ్పి చైర్ పర్సన్ గా ఉండేవారని ఉపముఖ్యమంత్రి అంటున్నారని, ఈనాడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జడ్చర్ల ఎ మ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎంపీ మల్లు రవి లు కలిసి ఒక మంచి పదవి రబ్బాని ఇవ్వాలని సూచించారు.

ఆనాడు నాతో పని చేసిన సర్పంచులు ఎంపిటిసి లతోపాటు ప్రజలు ఎన్నో కష్టాలను చూసామని వాగులు దా టేందుకు ప్రయత్నాలు చేసినప్పుడు ఎంతోమంది కొట్టుకుపోయారని గుర్తు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మిడ్జిల్ మండలంతో పాటు గట్టు మండలాన్ని డా ర్క్ మండలాలుగా గుర్తించడం జరిగిందన్నా రు.  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ మండలాన్ని దత్తత తీసుకోవాలని కోరారు.   

కలలను సాకారం చేసుకున్నప్పుడే జీవితానికి అర్థం: మంత్రి జూపల్లి  

మనిషి పుట్టడం గిట్టడం సహజమని, ఇది ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతుందని  మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పుట్టిన ప్రతి ఒక్కరూ తమ కలలను నిజం చేసుకున్నప్పుడే ఆ జీవితానికి అర్థం ఉంటుందని, అందుకు నిలువెత్తు నిదర్శనం సీఎం రేవంత్‌రెడ్డి అని పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చి తిరుగులేని నాయకుడిగా ఎదిగి  రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో తీసుకుపోతున్నాడు.  పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశ గా ముందుకు సాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు తమ తమ వృత్తుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలి.

సీఎం రేవంత్‌తోనే జడ్జర్ల అభివృద్ధి: ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి 

సీఎం రేవంత్‌రెడ్డి వల్లే జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందినదని ఎమ్మెల్యే అనిరు ధ్‌రెడ్డి పేర్కొన్నారు. ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ 631 కోట్లు, ఊరుకొండ పేటకు రూ.10 కోట్లు, ఊరుకొండ ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయానికి రూ 12 కోట్ల 80 లక్షల ను, జక్‌బోయిన్పల్లి టు వెల్జాల వరకు రూ.కోటి 20 లక్షలతో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. మిడ్జిల్లో మహిళలకు సమైక్య భవన నిర్మాణం కోసం  రూ.65 లక్షలు.. వీటితో పాటు అనేక అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చారని పేర్కొన్నారు.

నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా నిధులు తీసుకువస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్,వంశీకృష్ణ, మెఘా రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, నవీన్ యాదవ్, మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా  కొత్వాల్, సరితా తిరుప తయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీ వ్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

మీ ఆశీర్వాదంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తా: సీఎం 

మీ ఆశీర్వాదంతో సమర్థవంతంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తానని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెస్సితో ఫుట్బాల్ ఆడిన దేశంలో ఎక్కడ తిరిగిన మీరు నాటిన మొక్కనే ఈరోజు పెద్దదై ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. ఈ బాధ్యతను కొనసాగించేందుకు నిండు మనసుతో ఆశీర్వదించాలని ఇంకా నేను చేయవలసిన పనులు ఉన్నా యని చెప్పారు. వలసల జిల్లాను అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత తమపై ఉందని, చేయాల్సిన పనులు మిగిలే ఉన్నాయన్నారు. 

జిల్లాలో ప్రతి పేదవాడికి విద్యతో పాటు ఉద్యోగం అవసరమైన సదుపాయాలు, సాగునీరు అందేలా చూస్తామన్నారు. 2034 వర కు కాంగ్రెస్ అధికారంలో పక్కాగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు నేను జెడ్పిటిసి అవుతా అంటే మీరు చేశారని, ఎమ్మెల్సీ కావాలంటే చేశారని, కోడంగల్ కు వెళితే రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారని అక్కడ కష్టం వస్తే మల్కాజ్ గిరి పార్లమెంట్ లో ఎంపీగా చేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేసి మీ ముందు నిలబడేలా ఆశీర్వదించారని చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ రావాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని పేర్కొన్నారు.  

సాధారణమైన విషయం కాదు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జెడ్పీటీసీగా ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం గొప్ప విషయం  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా తమ పరిపాలన కొనసాగుతుందన్నారు. పాలనంటే అధికారం కాదని, ప్రజల కోసం పాటుపడడమని, రాష్ర్టంలో కోటి 15 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని, 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, భోజనం అందిస్తున్నామని, నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించామని చెప్పారు. వడ్డీ లేని రుణా లో భాగంగా ప్రతి సంవత్సరం స్వయం సహాయక మహిళా సంఘాలకు 20 వేల కోట్లు ఇస్తున్నామని, ప్రజల అవసరాలు తీర్చడమే పరిపాలన అని పేర్కొన్నారు.