10 May, 2026 | 3:02 AM

ప్రస్తుతం ఆరుగురితో క్యాబినెట్

10-05-2026 01:44 AM

ప్రస్తుతం ముఖ్యమంత్రి సువేందుతో కలిపి ఆరుగురు సభ్యులతో క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే క్యాబినెట్‌ను విస్తరించనున్నారు. ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.

సీఎం సువేందు అధికారి 

ముఖ్యమంత్రి, హోంశాఖ, పర్సనల్ (సిబ్బంది వ్యవహారాలు) శాఖను తీసుకున్నారు. ఈయన బంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం రావడానికి కీలక భూమిక పోషించారు.

దిలీప్ ఘోష్

బంగాల్‌లో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో ఈయన కీలకపాత్ర పోషించారు. గతంలో మేదినీపూర్ ఎంపీగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

అగ్నిమిత్ర పాల్

ప్రస్తుత క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా మంత్రి అగ్నిమిత్ర పాల్. మాజీ ఫ్యాషన్ డిజైనర్ అయిన ఈమె అసన్సోల్ దక్షిణ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

నిషిత్ ప్రామాణిక్

ఉత్తర బంగాల్‌కు చెందిన యువ నాయకుడు. గతంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాజ్‌బంగ్‌జీసామాజిక వర్గంలో ఈయనకు మంచి పట్టు ఉంది.

అశోక్ కీర్తనియా

బంగావ్ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే. బంగాల్ రాజకీయాల్లో కీలకమైన మధువా సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. 

క్షుదిరామ్ తుడు

బంకురా జిల్లాలోని రాణిబంద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జంగిల్ మహల్ ప్రాంతంలోని గిరిజన వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.