పాలెం సబ్‌స్టేషన్ ప్రారంభించిన మంత్రి పొన్నం
08-07-2026 12:27 PM
బిజినేపల్లి: మండల పరిధిలోని పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సబ్‌స్టేషన్‌తో పాలెం, పరిసర ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని, విద్యుత్ అంతరాయం తగ్గి రైతులు, ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు అక్కడ ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.






