8 July, 2026 | 1:48 PM

చింతల్ తానలో ఘనంగా పోచమ్మ బోనాలు

08-07-2026 12:50 PM

మంచి వర్షాలు, సమృద్ధిగా పంటలు పండాలని గ్రామస్తుల ప్రార్థనలు

తంగళ్ళపల్లి, జూలై 8(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్లపల్లి మండలం చింతల్ తాన గ్రామంలో గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సకాలంలో మంచి వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని గ్రామ ప్రజలు పోచమ్మ తల్లిని ప్రార్థించారు. గ్రామంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు నెలకొనాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రం అనసూయ మహేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల వేడుకలను విజయవంతం చేశారు.