29 June, 2026 | 1:34 AM

పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత

29-06-2026 12:41 AM

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

దామరచర్ల, జూన్ 28 : మండల కేంద్రంలో చిన్నారులకు ఆదివారం స్వయంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో వ్యాధి నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమైందని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. పోలియో నిర్మూలన లక్ష్య సాధనకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ ,ప్రధాన కార్యదర్శి గాలం వెంకన్న, మాజీ సర్పంచ్ కిరణ్ , స్కైలాబ్ నాయక్, సిద్దు నాయక్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ధ్యేయం

 మిర్యాలగూడ, జూన్ 28 : పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ పల్స్ పోలియో చుక్కల పంపిణీ మిర్యాలగూడ పట్టణంలో చిన్నారులకు కౌన్సిలర్లతో కలిసి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పోలియో చుక్కలను ప్రతి చిన్నారికి వైద్య ఆరోగ్య సిబ్బంది అందించాలని అన్నారు.

పోలియో చుక్కలను అందించే విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అర్హులైన చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు