సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి
భావన ఋషి సొసైటీ అధ్యక్షుడు సీత ఆంజనేయులు
హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలను పట్టించుకోకుండా పనులు చేపట్టడంపై ఆందోళన
జవహర్ నగర్, జూలై 23 (విజయక్రాంతి): దమ్మాయిగూడ భావన ఋషి కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన సర్వేనెంబర్ 158లోని స్థలంలో సబ్ స్టేషన్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని భావన ఋషి సొసైటీ అధ్యక్షుడు సితాంజనేయులు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై జా యింట్ కలెక్టర్ జారీ చేసిన E2/1774/2025 ఉత్తర్వులను సవాలు చే స్తూ హైకోర్టులో దాఖలు చేసిన డబ్ల్యూ.పీ. నెం. 2225/2026లో 2026 జనవరి 27న స్టేటస్ కో ఆదేశాలు పొందామని తెలిపారు. ఆ ఆదేశాల ప్రకారం సర్వే నంబర్ 158 సర్వేనెంబర్ 710/1లకు సంబంధించిన స్థలంలో ఎలాంటి పనులు చేపట్టకూడదని చెప్పారు. అయితే తహసీల్దార్ సూచనల మేరకు విద్యుత్ శాఖ అధికారులు నిన్న, ఈరోజు జేసీబీలతో భూమి తవ్వించి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
25 ఏళ్లుగా కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో, అంతేకాక ఇళ్ల మధ్యలో సబ్స్టేషన్ నిర్మించడం ప్రజల భద్రతకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలను గౌరవిస్తూ సబ్స్టేషన్ నిర్మాణానికి ఇచ్చిన కేటాయింపును వెంటనే రద్దు చేసి, చేపడుతున్న పనులను నిలిపివేయాలని భావన ఋషి కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు సీత ఆంజనేయులు ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు వెలువడే వరకు వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు చేపట్టవద్దని సంబంధిత అధికారులను కోరారు.






