24 July, 2026 | 2:30 AM

మీరు రాజీనామా చేశారా?

24-07-2026 01:17 AM
  1. మమ్మల్ని అడుగుతున్నారు! 
  2. టెన్త్ పేపర్ లీకైతే సీఎం రేవంత్ ఎందుకు తప్పుకోలేదు? 
  3. ‘నీట్’ ఘటనలో కేంద్రం 17 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది 
  4. రెండోసారి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాం 
  5. కాంగ్రెస్‌దే లీకుల చరిత్ర 
  6. రాహుల్, రేవంత్‌కు ప్రశ్నించే హక్కు లేదు 
  7. ఢిల్లీలో మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి) : ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లెక్కకు మించి పరీక్ష పేపర్ల లీకేజీలు జరిగాయి. అప్పుడు రాజీనామా చేయని వ్యక్తులు.. ఇప్పుడు బీజేపీ మంత్రులను రాజీనామా చేయాలని అడుగుతున్నారు. లీకుల చరిత్ర మీదే’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్‌లపై, తమ మంత్రులను రాజీనామా చేయాలని ప్రశ్నించే నైతిక హక్కులు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి లేదని విమర్శించారు.

మీ హయాంలో ఎన్ని రకాల ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయో తెలుసుకోవాలని హితవు పలికారు. అప్పుడు ఎంతమంది మంత్రులు రాజీనామా చేశారో మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు రాజకీయాలు, అధికారమే తప్ప విద్యార్థుల భవిష్యత్తు, దేశ భద్రత అవసరం లేదని, వారికి అధికారం రాకపోతే ఏ వ్యవస్థనైనా కూల్చేస్తామన్నట్టు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా పేపర్ లీక్ చేసిన వారికి కఠిన శిక్ష విధిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినా రాజకీయ అస్థిత్వం కోసం కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అరాచకం చేస్తున్నాయని, కాంగ్రెస్.. జాతీయ పార్టీ అనే విషయాన్ని మర్చిపోయి, దేశంలోని అన్ని వ్యవస్థలను కూ ల్చే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. విద్యార్థులను ఎగదోసి దేశ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశా రు.

ఢిల్లీ కేంద్రంగా, గత రెండు రోజులుగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని, ఈ ధర్నాలు రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నాయని మండిపడ్డారు. విద్యార్థుల ను అడ్డుగా పెట్టుకుని, దేశ వ్యతిరేక శక్తులు ఇలా దాడులకు కారణం అవుతున్నారని, షహీన్‌బాగ్‌లో జరిగిన ఘటనల మాదిరిగానే విద్యార్థుల ను అడ్డుగా పెట్టుకుని కొందరు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

నీట్ పేపర్ లీక్ అయినప్పుడు వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, 17 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టిందని, మిలటరీ విమానాల ద్వారా పేపర్లను తరలించి.. రెండోసారి సమర్థవంతంగా నీట్ పరీక్ష నిర్వహించారని గుర్తు చేశారు. ఏ పేపర్ లీక్ అయినా కూ డా రాసిన విద్యార్థులు, అభ్యర్థులు, తల్లిదండ్రులు బాధ పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ అయితే కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకొచ్చామన్నారు.

పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ ద్వారా పేపర్ లీక్ బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా సవరణలు తీసుకొచ్చామని, పరీక్ష పత్రా లు లీక్ కాకుండా చూడాలని బాధ్యతగా సలహాలు ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం బా ధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్నారు. పేపర్ లీకేజీ బాధ్యులైన 17 మంది నిందితులను సీబీఐ అరెస్టు చేసిందని, పేపర్ లీకేజీ విషయంలో జీరో టోలరెన్స్ పాలసీ తీసుకొస్తున్నామని చెప్పారు. దీనికి రాష్ట్రాలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మమతా బెనర్జీ సీఎంగా ఉన్నప్పుడు పశ్చిమబంగాల్‌లో పేపర్లు లీకయ్యాయని, వారి హయాంలో ఒకలా.. బీజేపీ హయాంలో ఒకలా మీరు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వీరు ధర్నాలు చేస్తారనే ఆలోచనతో కాకుండా.. విద్యార్థులకు నష్టం జరగకుండా.. వారి భవిష్యత్తు నాశ నం కావొద్దనే ఉద్దేశంతో పకడ్బందీగా రెండోసారి నీట్ పరీక్ష నిర్వహించామని తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

రేవంత్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు

2025లో పదో తరగతి పరీక్ష పత్రం లీక్ అయినపు్పుడు విద్యాశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని రాంచందర్‌రావు ప్రశ్నించారు. టీచర్లను సస్పెండ్ చేశారు.. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై సమాధానం చెప్పిన తర్వాతే రేవంత్‌రెడ్డి నీట్ పేపర్ గురించి ప్రస్తావించాలన్నారు. 2026 లో జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, జగిత్యాలలో బీఎస్సీ పేపర్ లీక్ అయిందని, అప్పుడు మీ కాంగ్రెస్ మంత్రులతో రాజీనామా చేయించారా? అని నిలదీశారు.

కాంగ్రెస్‌ది లీకుల చరిత్ర అని, విద్యార్థులపై కాంగ్రెస్‌కు ప్రేమ లేదన్నారు. తమిళనాడులో, కేరళ, ఢిల్లీలో షీలా దీక్షిత్ హ యాంలో, రాజస్థాన్‌లో సచిల్ పైలట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా పాదయాత్ర చేశారని, రాజస్థాన్‌లో అశోక్‌గెహ్లాట్ హయాంలో 18 పేపర్లు లీక్ అయ్యాయని గుర్తు చేశారు. అప్పుడు ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడలేదన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో 12వ తరగతి ఇంగ్లిష్, జార్ఖండ్‌లో, డీఎంకే హయాంలో తమిళనాడులో, పశ్చిమ బెంగాల్‌లో టీచర్ పేపర్ లీక్ అయిందన్నారు.

కేజ్రీవాల్ పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, కానీ పంజాబ్‌లో కూడా పేపర్లు లీక్ అయ్యాయని విమర్శించారు. మరి అక్కడికి వెళ్లి.. ఎందు కు ధర్నాలు చేయలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహ త్యలు చేసుకున్నప్పుడు మీరు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎలాం టి మార్పులు కావాలన్నా.. సంస్కరణలు తీసుకురావాలన్నా మేం అంగీకరిస్తామని స్పష్టం చేశారు.

చర్చలకు వచ్చి.. సలహాలు ఇవ్వాలని సభలో అడగాలి.. కానీ చర్చకు రాకుండా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సభ లో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించాల్సింది పో యి లేనిపోని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు ఎన్నిసార్లు లీక్ అయ్యాయనో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

బీచ్‌లో చెడ్డీలు వేసుకునే వారు కూడా ప్రశ్నించడం సిగ్గుచేటు

తుక్డే గ్యాంగులు.. భారత్‌ను ముక్కలు చేయాలని, నిర్వీర్యం చేయాలని ఆలోచించే వాళ్లంతా.. జంతర్ మంతర్ వద్దకు చేరి ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో పెట్టుబడులు తీసు కొస్తున్నామని, దేశ గౌరవాన్ని పెంపొందిస్తున్నామని, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నామని చెప్పారు. బీచుల్లో చెడ్డీలు వేసుకుని తిరిగే మీరు ఇవాళ రాజీనామా చేయాలని ప్రశ్నించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.

దేశ వ్యతిరేక శక్తులు ఏకమై దేశ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. 2023లో తెలంగాణలో ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అసలు అమలు చేశారా?, 2024 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. ఇవేవీ అమలు చేయకుండా మా గురించి ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అశోక్ నగర్ లైబ్రరీ అడ్రస్ ఇప్పుడు రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి గుర్తుం దా?, మా హామీలు అమలు చేయలేకపోయామని తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చె ప్పారా? అని నిలదీశారు.

విద్యార్థులకు, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ దని, అలాంటి వాళ్లు మాకు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కోదండరాం ఇన్ని రోజులు ఎక్కడ పోయారు?, మీకు ఎమ్మెల్సీ ఉద్యోగం రాగానే అందరికీ ఉద్యోగం వచ్చినట్టేనా?, జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే  మీరు కనీసం ప్రశ్నించారా?, కాలేజీల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయ లేదని, వాటి గురించి ప్రశ్నించకుండా.. ఇప్పుడు మాకు నీతులు చెబుతున్నారని విమర్శించారు.

సంఘ విద్రోహ శక్తులను ధర్నాలో చేర్చి.. పోలీసులపై దాడులు చేస్తున్నారని, ఈ విషయాలను సమాజం, ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎలాంటి పేపర్లు లీక్ కా కుండా కేంద్రం తరఫున ఏ రకమైన చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశా రు. ఈ విషయంపై పార్లమెంటులో చర్చిద్దామని, విద్యార్థుల భవిష్యత్తు గురించి చర్చించేందుకు మీరు రావాలి.. అంతేకానీ అనవసరమైన రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.

ఇది బీజేపీ ప్రభుత్వం కాదు.. దేశ ప్రజల ప్రభుత్వమని స్పష్టం చేశారు. అవగాహన లేని రాహుల్ గాంధీ లాంటి వల్ల విద్యార్థులకు నష్టం తప్పితే ఒరిగేదేమీ లేదన్నారు. నరేంద్రమోడీ టైంపాస్ ప్రధానమంత్రి కాదని, దేశం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టే అనేక రంగాల్లో భారీ సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.