24 July, 2026 | 3:07 AM

నేటి నుంచి ఢిల్లీ మెట్రో బంద్

24-07-2026 02:01 AM
  1. 17 మెట్రోస్టేషన్లు మూసివేత
  2. భద్రతా కారణాలే: డీఎంఆర్సీ 

న్యూఢిల్లీ, జూలై 23: జంతర్ మంతర్ వద్ద బొద్ధింక జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో, సెంట్రల్ ఢిల్లీలోని 17 మెట్రో స్టేషన్లు శుక్రవారం కూడా మూసివేయనున్నారు. ఇది వరుసగా మూడో రోజు మూసివేత కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా, శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ స్టేషన్లు మూసివే స్తామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) గురువారం రాత్రి తెలిపింది. లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీం కోర్ట్, సేవాతీర్థ, జన్‌పథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం, ఝండేవాలన్ స్టేషన్లు మూసివేస్తారు.

అయితే రాజీవ్‌చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌ఛేంజ్ సౌకర్యాలు అందు బాటులో ఉంటాయని డీఎంఆర్సీ తెలిపింది. నిరసనలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల కారణంగా బుధవారం, గురువారం కూడా అవే స్టేషన్లను మూసివేశారు. దీంతో సెంట్రల్ ఢిల్లీలోని ఉద్యోగులకు, విద్యార్థులకు, ఇతర ప్రయా ణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. గురువారం, సుమారు 14 గంటల పాటు మూసివేసిన తర్వాత, సెంట్రల్ సెక్రటేరియట్, మండి హౌస్, రాజీవ్ చౌక్ అనే మూడు స్టేషన్ల ప్రవేశ ద్వారాలను రాత్రి ఆలస్యంగా తెరిచారు. మిగిలిన స్టేషన్లను మూసివేశారు.