సీజేపీకి బీఆర్‌ఎస్వీ మద్దతు
ఇందిరాపార్కు వద్ద నేడు ఆందోళన
హాజరుకానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ చర్యలపై ఖండన
ఉదయం 10 నుంచి 2 గంటల వరకు అనుమతి
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు సంఘీభావం తెలుపుతూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్‌వీ) శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నిరసనలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్టు బీఆర్‌ఎస్‌వీ తెలిపింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడేతానపి వెల్లడించింది.
ఈ ధర్నాకు హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కే మూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ధర్నాలో గరిష్ఠం గా వెయ్యిమందే పాల్గొనాలని సూచించారు. కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించాలని, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, డ్రోన్లు, స్కై లాంతర్లు, బాణాసంచా వినియోగించవద్దని షరతులు విధించారు. నిబంధనలు ఉల్లంఘించినా అనుమతి వెంటనే రద్దు చేసి, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






