15 May, 2026 | 3:07 AM

ఇందిరమ్మ గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలి

15-05-2026 01:52 AM

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బోధన్, మే 14 (విజయక్రాంతి): ఇందిరమ్మ గృహాలలో వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో ఇందిరమ్మండ్ల నిర్మాణ గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. బోధన్‌ఆర్డిఓ విజయ కుమారి, జిల్లా అధికారులతో కలిసి ఆయన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించారు.

సమస్యలను పరితంగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోని పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ తో పాటు కాంట్రాక్టర్ తో మాట్లాడి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పనులు పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.