కంటోన్మెంట్‌కు కాంగ్రెస్ ఏమీ చేయదు.. స్థానిక ఎమ్మెల్యే ఏమీ చెయ్యడు!
బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు : ఇంచార్జ్ క్రిశాంక్
సంక్షేమం పేరుతో స్థానిక ఎమ్మెల్యే కేవలం మాటలకే పరిమితం
సికింద్రాబాద్, మే29 (విజయ క్రాంతి): ఈనెల 31 న క్లాసిక్ గార్డెన్ లోకంటోన్మెంట్ బిఅర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, కంటోన్మెంట్ బిఅర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మన్నె క్రిశాంక్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓటర్ జాబితా సమగ్ర సవరణతోపాటు సభ్యత నమోదు కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న తరుణంలో ఈ కార్యక్రమానికి బిఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరుకానున్నట్లు మన్నె క్రిశాంక్ వెల్లడించారు.
ఈ సందర్భంగా మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ ఓటరు సమగ్ర జాబితా సవరణకు సంబంధించి బూతు స్థాయిలో ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ నాయకులు సమిష్టి కృషితో ఎస్‌ఐఆర్ తోపాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు క్రిశాంక్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 8వార్డు,1 డివిజన్ లో బూతు స్థాయిలో ట్రైనీ క్యాంప్ లు నిర్వహించి బిఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేసే రూపకల్పన చేస్తున్నట్లు మన్నే క్రిశాంక్ వెల్లడించారు.
తీరని అన్యాయం
కంటోన్మెంట్ ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తూ పబ్బం గడుపుతున్నాయని క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజి,తాగున్నీరు,వీధిదీపాల సమస్య ఉందని ఆరువేల ఇండ్లు కట్టిస్తానని హమిచ్చి ఆరు ఇండ్లు కట్టలేదని మన్నే క్రిశాంక్ విమర్శించారు.. స్థానిక ఎమ్మెల్యే కేవలం మాటలకే పరిమితం అయ్యారని మౌలిక వసతుల కల్పనలో సైతం పూర్తిగా విఫలమయ్యారని క్రిశాంక్ ఆరోపించారు.
సభ్యులు లేని కంటోన్మెంట్ బోర్డు: క్రిశాంక్
కేంద్ర ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా తాత్సా రం చేస్తూ నామినేటెడ్ పదవులతో కాలం వెళ్లదీయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను క్రిశాంక్ ప్రశ్నించారు.
కంటోన్మెంట్ మడ్ఫోర్ట్ గ్రౌండ్‌లో అట్టహాసంగా కుటుంబ సంక్షేమ కార్డు పేరుతో కార్యక్రమాన్ని తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కార్డు కూడా జారీచేసిన దాఖలాలు లేవని తెలియజేస్తూ కంటోన్మెంట్‌కు కాంగ్రెస్ పార్టీ ఏమి చెయ్యదు, స్థానిక ఎమ్మెల్యే ఏమి చెయ్యడు అన్ని బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్,కంటోన్మెంట్ ఓట్ల నమోదు ఇంచార్జ్ క్రిశాంక్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆకుల హరి, జక్కల మహేశ్వర్ రెడ్డి,లాస్య నందిత,టి.ఎన్ శ్రీనివాస్, శ్యామ్ కుమార్, నళిని కిరణ్, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.






