24 August, 2026 | 9:53 PM

Breaking News

చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •   చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలి   •   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది   •   ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •   డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •   విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి   •  

తనిఖీలు చేసి.. పాఠాలు చెప్పిన కలెక్టర్

08-07-2026 12:16 AM

ఖానాపూర్ జూలై 7 (విజయక్రాంతి): జిల్లా పాలనాధికారి భవేష్ మిశ్రా మంగళ వారం మారుమూల పెంబి మండలంలో ఆ కస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల, మందపల్లి కేజీబీవీ పాఠశాలలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ కు ఉపాధ్యాయులు విద్యార్థులు స్వాగతం పలికారు. తరగతి గదిలోకి గదిలోకి వెళ్లిన జి ల్లా కలెక్టర్ పదో తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను బోర్డుపై రాసి సమాధానాలు రాబట్టారు.

ప్రతిరోజు బడికి సార్లు సమయానికి వస్తున్నారా. పాఠాలు చెబుతున్నారా పుస్తకాలు ఇ చ్చారా అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ బడిలో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి అక్కడికి వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఏ అవసరంలో తక్షణం పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వి ద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అధికారులు ఉన్నారు. 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన 

పెంబి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన ఆయన ఉద్యోగుల హాజరు పట్టిక మందుల రిసిప్ట్ స్టాకు వివరాలు రోగులకు అందిస్తున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం 24 గంటలు అందించేందుకు వైద్య సిబ్బంది కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజేందర్ ఆసుపత్రి సిబ్బంది స్థానిక అధికారులు ఉన్నారు.